మెగా ఫ్యాన్స్‌కు ఇది నచ్చడం లేదు

మెగా ఫ్యాన్స్‌ కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి 150వ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.గత సంవత్సరంలోనే చిరంజీవి 150వ సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది.

అనేక కారణాల వల్ల వాయిదాలు వేస్తూ, ఆలస్యం చేస్తూ వస్తున్నారు.కొన్నాళ్ల క్రితం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మాణంలో చిరంజీవి 150వ సినిమా ఉంటుందని, అది చిరు పుట్టిన రోజున అగస్టు 22న ప్రారంభం కాబోతున్నట్లుగా స్వయంగా మెగా ఫ్యామిలీ హీరోలు ప్రకటించారు.

అయితే తాజాగా చిరంజీవి తన 150వ సినిమా ఈనెలలో ప్రారంభం అవ్వడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.ఈయన తాజాగా టీవీ9తో మాట్లాడుతూ.

పూరి జగన్నాధ్‌తో 150వ సినిమా చేయబోతున్నాను.అయితే ఇప్పటి వరకు కథ ఫైనల్‌ కాలేదు.

Advertisement

ఒక కథను అనుకున్నప్పటికి సెకండ్‌ హాఫ్‌ సరిగా రాక పోవడంతో పక్కకు పెట్టాము.ఈలోపు పూరి వరుణ్‌తో సినిమా చేస్తున్నాడు.

తాను ఇతర రచయితలు చెబుతున్న కథలు వింటున్నాను.తన 150వ సినిమాను ప్రారంభించేందుకు రెండు మూడు నెలలు పట్టే అవకాశముందని అన్నాడు.

చిరంజీవి చేసిన ఈ ప్రకటన ఏమాత్రం మెగా ఫ్యాన్స్‌కు రుచించడం లేదు.గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమకు ఇలా నిరీక్షించేలా చేయడం మంచిగా లేదంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా వెంటనే 150వ సినిమాను ప్రారంభించాల్సిందిగా ఫ్యాన్స్‌ కోరుతున్నారు.అయితే మెగాస్టార్‌ రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో మంచి కథ కోసం వెదికే పనిలో ఉన్నారు.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు