మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది మహేష్ !

ఒక్కసారిగా మహేష్ బాబు - బాలకృష్ణ హీరోలుగా మల్టిస్టారర్ అనగానే తెగ సంబరపడిపోయారు ఇరుహీరోల అభిమానులు.

ఇద్దరిని తెర మీద చూడాలనే కాంక్ష ఒకటైతే, ఒక హీరో మరో హీరోకి సహాయపడతాడు అనేది మరో కారణం.

కొరటాల శివ ఆశలన్ని కూల్చేస్తూ, అలాంటి కాంబినేషన్ తో సినిమా చేయట్లేదని ప్రకటించేశారు.కాని ఈ సినిమా జరిగుంటే ? ఓసారి సరదాకి అనుకోండి ఈ సినిమా నిజంగానే జరుగుతోందని.అప్పుడు ఎవరికి లాభం? మహేష్ కి లాభామా? లేక బాలకృష్ణ కి లాభామా? కాస్త లోతుగా ఆలోచిస్తే మహేష్ కే లాభం.అదెలా అంటారా? మహేష్ బాబుకి సూపర్ స్టార్ అనే బిరుదు, భారీ మార్కెట్, రికార్డులు, రివార్డులు అన్ని ఉన్నా, సీడెడ్ ఏరియాలో ఆధిపత్యం మాత్రం దొరకట్లేదు.ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సామానంగా సీడెడ్ జనాలని ఆకట్టుకోలేకపోతున్నాడు మహేష్.

అక్కడ పవన్ కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ తరువాతే అయినా, మహేష్ మీద బెటర్ అని చెప్పుకోవచ్చు.ఆశ్చర్యాన్ని కలిగించే నిజం ఏమింటంటే, మన ప్రిన్స్ కి సీడెడ్ లో ఇప్పటివరకు ఓపెనింగ్ రికార్డు లేదు.

ఆరకంగా ఆ ఏరియా మహేష్ కి కొరకరాని కొయ్య లాగా తయారయ్యింది.మరి బాలయ్య బాబు సీడేడ్ కి సుల్తాన్ లాంటివారు.అక్కడి ప్రేక్షకులకి బాలకృష్ణ తరువాతే ఎవరైనా.

Advertisement

బాలకృష్ణతో మల్టిస్టారర్ ఉండుంటే, బాలకృష్ణ సీడెడ్ ఫాలోయింగ్ మహేష్ కి బాగా ఉపయోగపడుండేది.మరి మహేష్ వలన బాలకృష్ణకి ఎలాంటి లాభం జరిగేది కాదా అంటే చాలా లాభం జరిగేది కాని, ఈ టైమ్ లో నందమూరి అందగాడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమి లేదు.

అందుకే అంటున్నాం, మహేష్ కి మంచి ఛాన్స్ మిస్ అయ్యిందని.

Advertisement

తాజా వార్తలు