ఆధార్ - పాన్ కార్డు లింక్ కి ఈరోజే చివరి తేది .. ఎలా చేసుకోవాలంటే

చిన్న నుంచి పెద్ద .

ప్రతి విషయంలో ఆధార్ లింకేజ్ ని కంపల్సరి చేస్తున్న భారత ప్రభుత్వం, ట్యాక్స్ చెల్లించేవారి విషయంలో ఆధార్ - పాన్ కార్డు లింకేజి తప్పనిసరి చేసిన విషయం విదితమే.

ఆ లింకేజి చేసుకోవాల్సిన చివరి తేది ఈరోజే.ఇప్పటికే 2.07 కోట్ల మంది ట్యాక్స్ పెయర్స్ ఈ లింక్ పని పూర్తీ చేసుకున్నారు.దేశంలో 25 కోట్లమంది పాన్ కార్డు హోల్డర్స్ ఉంటే, 111 కోట్ల మంది దగ్గర ఆధార్ కార్డు ఉంది.

మరి మీరు ట్యాక్స్ కట్టేవారే అయితే, ఈ రోజే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఆధార్ కార్డుని మీ పాన్ కార్డుతో లింక్ చేసుకోండి.ఒకవేళ ఎలా చేసుకోవాలి మీకు తెలియకపోతే రెండు పద్ధతులు ఉన్నాయి చూడండి.

మొదటి పధ్ధతి :

* E filing వెబ్ సైట్ లోకి వెళ్ళండి.వెళ్లి ఎడమవైపు ఉన్న Link Aadhar మీడ్ద క్లిక్ చేయండి.

* మీ ఆధార్ నంబర్ అలాగే పాన్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి.* మీ ఆధార్ కార్డు మీద ఎలాగైతే మీ పేరు నమోదు అయ్యి ఉందొ, అచ్చం అలాగే స్పెల్లింగ్ తప్పు లేకుండా ఎంటర్ చేయండి.

Advertisement

* అంతే, ఈ ప్రాసెస్ పూర్తీ.కాసేపటికే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

రెండోవ పద్దతి :

ఈ పధ్ధతిలో మీరు పని పూర్తీ చేయాలంటే, ఆధార్ కార్డు మరియు పాన్ కార్డులో మీ పేరు ఒకేలా ఉండాలి.Gonnala Ramesh అని ఓ చోట, G.Ramesh అని మరో చోట ఉంటే కుదరదు.ఇలా ఉంటే లింక్ అవడం కష్టం.

ఇక రెండు చోట్ల పేరు ఒకేలా నమోదు అయ్యి ఉంటే ఎలాంటి కంగారు, అనుమానం లేకుండా పని మొదలుపెట్టండి.* UIDPAN అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, మీ ఆధార్ కార్డు నంబర్ ని ఎంటర్ చేసి, మళ్ళీ స్పేస్ ఇచ్చి పాన్ కార్డు నంబర్ ని ఎంటర్ చేయండి.

* ఉదాహరణ : UIDPAN 123456789101 ANWP2312AN * ఇప్పుడు 567678 లేదా 56161 నంబర్ కి మెసేజ్ పంపండి.* మీ రిజిస్టర్డ్ నంబర్ కి వన్ టైం పాస్ వార్డ్ వస్తే ఎంటర్ చేయండి.

* వెరిఫికేషన్ తరువాత మీ ఆధార్, పాన్ కార్డు లింక్ అయినట్టు మెసేజ్ వస్తుంది.నోట్ : ఒకవేళ మీ ఆధార్ లేదా పాన్ కార్డులో ఏవైనా మార్పులు చేయాలి అనుకుంటే, National Securities Depository Ltd (NSDL) లోకి వెళ్లి UIDAI పోర్టల్ లో మార్పులు చేసుకోవచ్చు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు