రాజమౌళి చెప్పేవి నీతులు, చేసేవి బూతులు

మగధీర 100 రోజుల ఫంక్షన్ కి హాజరు కాలేదు రాజమౌళి.ఎందుకంటే అల్లు అరవింద్ తో గొడవ.

ఏ విషయం మీద అంటే ఈ 50 రోజులు, 100 రోజుల సెంటర్ల విషయం మీద.అలాంటి రికార్డులు వద్దు, వాటిని పట్టుకోని డప్పు కొట్టడం వద్దు అని.సింహాద్రి 175 రోజుల రికార్డు సమయంలో కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్ల రాజమౌళి చెప్పారు.బాహుబలి - ది బిగినింగ్ తాను చెప్పినట్టుగానే 50 రోజుల రికార్డు జోలికి పోలేదు, వాటిని పట్టుకోని పబ్లిసిటి కూడా చేసుకోలేదు.

కాని బాహుబలి - ది కంక్లూజన్ విషయంలో మాత్రం నీతులు కాస్త బూతులు అయిపోయాయి.బాహుబలి - ది కంక్లూజన్ దేశవ్యాప్తంగా 1050 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుందని, తెలుగు రాష్ట్రల్లో ఈ సంఖ్య 282 అని బాహుబలి టీమ్ పబ్లిసిటి, పోస్టర్స్ మొదలుపెట్టింది.

ఇలా పోస్టర్స్ వేయడం, ఆల్ టైమ్ రికార్డు అంటూ సెంటర్ల రికార్డు చెప్పుకోవడం తనకి నచ్చదు అంటూనే, అదే పని చేసాడు జక్కన్న.సరే, ఆయనిష్టం అనుకుందాం.

Advertisement

బాహుబలి 50 రోజుల సెంటర్ల లిస్టు ఇదిగోండి మీకోసం : తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - 282 తమిళనాడు - 120 ముంబాయి - 179 కర్ణాటక - 54 కేరళ - 102 ఒరిస్సా - 02 ఢిల్లీ + యూపి - 77 ఈస్ట్ పంజాబ్ - 25 రాజస్థాన్ - 29 సిపి - 61 సెంట్రల్ ఇండియా - 40 వెస్ట్ బెంగాల్ - 45 మరాట్వాడా - 08 బిహార్ - 26 అస్సాం - 01 ఓవర్సీస్ - 25 మొత్తం - 1076 (వరల్డ్ వైడ్).

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు