మధ్యలో పవన్ బలైపోయాడు

తెలుగులో అంటే ఆయన పవర్ స్టార్ .భారి అభిమాన గణం ఉంది.

సినిమా ఎలా ఉన్నా మొదటి మూడురోజులు అభిమానులు లాక్కొస్తారు.ఫ్లాప్ అయినా చెప్పుకోదగ్గ కలెక్షన్లు వస్తాయి.

మరి హిందీలో? తెలుగు సినిమా అంటే మహేష్ బాబు, నాగార్జున, అల్లు అర్జున్, బాహుబలి ప్రభాస్ .ఇదే తెలుసు హిందీ జనాలకి.మిగితా హీరోలను గుర్తుపట్టినా, చాలా తక్కుమందే.

మరి ఇలాంటి పరిస్థితులలో హిందీలో సర్దార్ గబ్బర్ సింగ్ ని విడుదల చేయాలనుకోవడం ఎంతవరకు సరైన నిర్ణయం! ఇప్పటికే కేఆర్కే, రామ్ గోపాల్ వర్మ ఒకరేంజిలో పవన్ పరువు తీస్తున్నారు .హిందీ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకోని కట్ చేసిన ట్రైలర్ కి కూడా నెగెటీవ్ రెస్పాన్స్ వచ్చింది.తప్పనిసరి పరిస్థితులలో ఇప్పుడు మరో ట్రైలర్ కట్ చేస్తున్నారు .ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ల గుండెలు జారిపోయాయి.శుక్రవారం వచ్చే కొత్త ట్రైలరైనా తెలుగు ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకోని కట్ చేస్తే బాగుంటుంది.

Advertisement

విడుదలకి ముందే ఇన్ని నెగేటీవ్ విషయాలు చూస్తున్నాడు పవన్.అయినా ఎంచక్క తెలుగుతోనే సరిపెట్టుకోకా, ఈ హిందీ రిలీజ్ లు .దానికి తగ్గట్టుగా ప్రమొషన్స్ మనకి అవసరమా! అయితే తప్పు పవన్ ది కాదంట .ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళే హిందీ వెర్షన్ కోసం పట్టుబట్టారంట .నిర్మాత శరత్ మరార్ సరే అన్నాడట .మధ్యలో పవన్ బలైపోయాడు.

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?
Advertisement

తాజా వార్తలు