డీజే ఫేక్ కలేక్షన్లపై దిల్ రాజు ఏమన్నారంటే

ఈ ఏడాది దిల్ రాజు మంచి ఫామ్ లో ఉన్నారు.

శతమానంభవతి నుంచి మొదలు డిజే-దువ్వాడ జగన్నాథం వరకు, మధ్యలో బాహుబలిని మినహాయిస్తే బాక్సాఫీస్ మెరుపులన్ని ఆయనవే.

కేవలం నిర్మాతగానే కాకుండా పంపిణిదారుడిగా కూడా దిల్ రాజు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.ఇన్నాళ్ళు దిల్ రాజు మీద ఎలాంటి అనుమానం ఉండేది కాదు.

ఆయన తన సినిమాలకి ఫేక్ కలెక్షన్లు అస్సలు చెప్పరు అని పేరు ఉండేది/ ఇంకా ఉంది.కాని డీజే ఆయన ఇమేజ్ మీద దెబ్బ వేసింది.

డీజే కలెక్షన్లు ఫేక్ అంటూ ఎక్కడపడితే అక్కడ ప్రచారం జరుగుతోంది.డిజే 70 కోట్ల క్లబ్ లో చేరిపోయింది అంటూ యూనిట్ తో పాటు అల్లు అర్జున్ పీఆర్ టీమ్ ఢంకా బజాయిస్తోంటే అంతా ఉత్తుత్తి మాటలే అంటూ మిగితా హీరోల ఫ్యాన్స్ అంటున్నారు.

Advertisement

ఈ కాంట్రవర్సీ మీద మొత్తానికి స్పందించారు దిల్ రాజు.డిజే కలెక్షన్లు ఫేక్ కాదు అంట.తాను ఎప్పుడైనా వచ్చిన నంబర్లనే చెప్పానని, డిజే - దువ్వాడ జగన్నాథం విషయంలోనూ అంతే, వచ్చిన కలెక్షన్లనే తప్ప, ఎక్కువ కలిపి చెప్పలేదు.డిజే అల్లు అర్జున్ కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్.

సరైనోడు సినిమాని దాటేసింది.డీజేకి మంచి కలెక్షన్లు వచ్చినా, కొందరు పంపిణిదారులకి నష్టాలు వచ్చిన మాట వాస్తవమే, బాధ్యత గల నిర్మాతగా నా డిస్ట్రిబ్యూటర్స్ ని నేను ఆదుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు.

మరి దిల్ రాజు లెక్కల్లో డిజే సరనోడుని దాటేస్తే, సరైనోడుకి నిర్మాతలు చెప్పిన లెక్కలు తప్పు అన్నట్టేగా.అంటే డిజేకి ఫేక్ జరిగినా, జరగకపోయినా, సరైనోడు విషయంలో మాత్రం జరిగినట్టేగా? రెండిట్లో ఏది నిజమైనా, ఏది అబద్ధమైనా, రెండు అల్లు అర్జున్ చిత్రాలే కాబట్టి గీతా ఆర్ట్స్ అల్లు అర్జున్ సినిమాలకి ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది అనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు