రాజధాని శంకుస్థాపనకు మోడీని ఆహ్వానిస్తాం

ఏపీ రాజధాని మార్పు విషయంలో జగన్‌ ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది.

ఇప్పటికే మూడు రాజధానుల బిల్లును తీసుకు వచ్చిన జగన్‌ ప్రభుత్వం అతి త్వరలో వైజాగ్‌ నుండి పరిపాలన కొనసాగించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ సమయంలో రాజధాని విషయమై కోర్టులో కేసు నడుస్తోంది.అయినా కూడా వైజాగ్‌లో రాజధాని శంకుస్థాపన జరుగబోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

ఆ శంకుస్థాపనకు పీఎం మోడీని కూడా ఆహ్వానించబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.ఎవరు ఎంతగా అడ్డుకునేందుకు ప్రయత్నించినా కూడా రాష్ట్ర ప్రజల కోరిక తీరబోతుందని ఆయన అన్నారు.

అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా మరవకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఈ సందర్బంగా బొత్స హామీ ఇచ్చారు.చంద్రబాబు స్వప్రయోజనాలే ముఖ్యంగా అమరావతిని రాజధానిగా చేశారని జగన్‌ ప్రభుత్వం ప్రజా ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని అమరావతిని మాత్రమే కాకుండా వైజాగ్‌ ను కూడా రాజధానిగా చేయాలని నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నాడు.

Advertisement

ఈ విషయంలో ఎవరికి అన్యాయం జరుగకుండా జగన్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని బొత్స అన్నారు.గతంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీని మళ్లీ వైజాగ్‌ రాజధానిగా శంకుస్థాపనకు పిలుస్తామని బొత్స చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు