మాటీవీలో ‘బాహుబలి’ జర్నీ

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో మళ్లీ మళ్లీ చెప్పనక్కర్లేదు.

బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ సైతం నోరు వెళ్లబెట్టి చూసే విధంగా ‘బాహుబలి’ కలెక్షన్స్‌ వచ్చాయి.

ఇండియాస్‌ సెకండ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ను సాధించిన ‘బాహుబలి’ చిత్రాన్ని బుల్లి తెరపై వేసేందుకు మాటీవీ భారీ మొత్తం పెట్టి హక్కులను దక్కించుకున్న విషయం తెల్సిందే.త్వరలో వంద రోజులు పూర్తి చేసుకోబోతున్న ‘బాహుబలి’ చిత్రాన్ని మాటీవీ తమ ప్రేక్షకులకు దసరా కానుకగా ఇవ్వబోతుంది.

‘బాహుబలి’ని అక్టోబర్‌ 25 సాయంత్రం 6 గంటలకు వేయాలని నిర్ణయించారు.అందుకోసం దాదాపు రెండు వారాల ముందు నుండే ‘బాహుబలి’ ది జర్నీ అంటూ ప్రచారం మొదలు పెట్టబోతున్నాడు.

అందులో భాగంగానే అక్టోబర్‌ 10 నుండి కూడా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలను వరుసగా వేయనున్నారు.అక్టోబర్‌ 10న ‘చత్రపతి’, 11న ‘విక్రమార్కుడు’, 17న ‘మర్యాద రామన్న’, 18న ‘ఈగ’, 18న ‘యమదొంగ’, 24న ‘మగధీర’ను టెలికాస్ట్‌ చేయనున్నారు.24న ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన విశేషాలను చిత్ర యూనిట్‌ సభ్యులు మాటీవీతో పంచుకోనున్నారు.కర్టన్‌ రైజింగ్‌ కార్యక్రమంతో బాహుబలి జర్నీ చివరి దశకు చేరుకుంటుంది.25న సాయంత్రం విజువల్‌ వండర్‌ అయిన బాహుబలి బుల్లి తెరపై సందడి చేయనుంది.

Advertisement
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

తాజా వార్తలు