ఎవరు? బంధువులా? కాదు.కానీ ఒకాయన ఉన్నారు.
ఆయన మనోడే కానీ ఒక బంధువుగా వ్యవహరిస్తున్నారని అందరూ అంటూ ఉంటారు.ఆయన పదవిని చాలా గొప్పది.
ఎక్కువ కాలం దేశంలోనే ఉండాలి.కానీ దేశంలో తక్కువగా, విదేశాల్లో ఎక్కువగా ఉంటారు.
ఈ కీలక వ్యక్తీ పేరు నరేంద్ర మోడీ.ఇండియా ప్రధాని.
ఈయన దేశంలో ఉండేది తక్కువ.విదేశాల్లో ఉండేది ఎక్కువ కావడంతో దీని మీద సామాజిక మీడియాలో జోకులు కూడా వస్తున్నాయి.
మోడీ ప్రధానిగా కాకుండా ఇండియాకు చుట్టంగా వ్యవహరిస్తున్నారని కొందరు నాయకులు విమర్శిస్తున్నారు.వాస్తవం కూడా అలాగే ఉంది.
వారం రోజుల పాటు ఐర్లాండ్, అమెరికా దేశాల్లో పర్యటించిన మోడీ స్వదేశానికి తిరిగి వచ్చారు.ఆయన తిరిగి వచ్చే లోగానే తరువాతి టూర్ సిద్ధం అయ్యే ఉంటుంది.
మళ్ళీ కొద్ది రోజుల్లోనే విదేశీ పర్యటన ఉండొచ్చు.ప్రధానులు విదేశాలకు వెళ్ళాలి.
తప్పదు.విదేశాలతో సంబంధాలు బలపడాలంటే ఆయా దేశాలకు పోవాలి.
అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలి.కానీ పర్యటనలు మిమీరి పోయాయనే విమర్శలు వస్తున్నాయి.
దేశ సమస్యలను పట్టించుకోకుండా విదేశాల్లో గొప్పలు చెప్పుకుంటున్నారని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.ఆయన మాటల ప్రధానే గాని చేతల ప్రధాని కాదని చెబుతున్నారు.
ఇందులో కొంత నిజం ఉంది.ఎన్నికల్లో చేసిన వాగ్దానాలలో చాలా వాటిని మోడీ నెరవేర్చలేదు.
మాటలతో మాయ చేస్తున్నారు.యూపీఏ సర్కారు కంటే మోడీ సర్కారు భిన్నంగా లేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
విదేశాల్లో ఆకట్టుకునే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి వారు ఈయనను గొప్ప పరిపాలకుడు అనుకుంటున్నారు
.






