ఇంఫెక్షన్ వలన ఓ మహిళ గుండె ఆగిపోయింది !

ఇంఫెక్షన్ వలన ఏం జరుగుతుంది అంటే మన ఆలోచనలు జ్వరం, దగ్గు, జలుబు నుంచి దూరంపోవు.ఎందుకంటే మనకు సామాన్యంగా తెలిసిన ఇంఫెక్షన్లు అవే.

మహా అయితే ఈ వర్షాకాలంలో కొన్నిరకాల జ్వరాలు వస్తాయని తెలుసు.కాని ఇంఫెక్షన్ వలన గుండె ఆగిపోతే ? ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారా ? అల్రెడి జరుగుతోంటే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈస్టు గోదావరికి చెందిన అరుణ కృష్ణ వయసు 24 సంవత్సరాలు.

గర్భవతిగా ఉన్నప్పుడు తిమ్మిదొవ నెలలో అనుకోకుండా ఓ వైరల్ ఇంఫెక్షన్ ఈవిడ శరీరంపై దాడి చేసింది.అంతే, పెరి పార్టమ్ కార్డియో మయోపతి అనే సమస్య అరుణ శరీరంలో మొదలైంది.

ఇది చాలా అరుదైన కండీషన్ అంట.ఇది ఎంత ప్రమాదం అంటే, మనిషి గుండె ఆగిపోతుంది.అదృష్టవశాత్తూ, అరుణ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోని ప్రాణాలు దక్కించుకుంది.

Advertisement

"తను (అరుణ) అదృష్టవశాత్తూ సమస్య మొదట్లోనే మా వద్దకు వచ్చింది.అప్పటికి తన గుండె యొక్క రైట్ వెంట్రికల్ ఇంకా పాడవలేదు.

అదృష్టం ఏంటంటే తన ఊపిరితిత్తులు కూడా బాగా పనిచేస్తున్నాయి.హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ విజయవంతంగా పూర్తయ్యి పేషెంట్ మామూలుగా ఉండాలంటే ఊపిరితిత్తులు, కిడ్నిలు, లివర్ లాంటి శరీరభాగాలు బాగా పనిచేయడం ఎంతో అవసరం.

అన్ని సరైన పద్ధతిలో ఉండేసరికి అరుణని కాపాడుకోగలిగాం" అంటూ హైదరాబాద్ యశోధ హాస్పిటల్స్ లో సీనియర్ డాక్టరుగా పనిచేస్తున్న పి.వి.నరేష్ కుమార్ తెలిపారు.అరుణకి అత్యవసర సమయంలో కరీంనగర్ జిల్లాలో రోడ్డు ఆక్సిడెంట్లో మరణించిన ఓ 47 ఏళ్ళ వ్యక్తి గుండె లభించింది.

చూసారా .అవయవదానం ఎలా మరో మనిషి ప్రాణాల్ని కాపాడిందో.అరుణ కోలుకున్నప్పటికి, ఇంకా వైద్యల పర్యవేక్షణలో అవసరమైన మందులు వాడుతోంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు