మగవారికి మాత్రమె వచ్చే 5 చిత్రమైన రోగాలు

వ్యాధులు వేలరకాలు.అందులో 99% వ్యాధులు మనిషి శరీరంపై దాడిచేస్తాయి.

అంటే స్త్రీ, పురుషుడు అనే తేడా ఉండదు.

అవి ఏ శరీరంలో అయినా పెరగొచ్చు.

కాని కొన్ని వ్యాధులు ఉంటాయి, కొన్ని కేవలం స్త్రీ శరీరానికే అంటుకుంటాయి, కొన్ని కేవలం పురుషుడి శరీరానికే అంటుకుంటాయి.అంటే ఈ వ్యాధులు శరీర నిర్మాణాన్ని బట్టి వస్తాయి అన్నమాట.అందులో ఈ రోజు కేవలం మగవారికే వచ్చే 5 రోగాలను తెలుసుకోండి.

టెస్టికులర్ క్యాన్సర్ :

బ్రీస్ట్ క్యాన్సర్ స్త్రీలకు వస్తుందని తెలుసు.కాని అదేరకమైన రొమ్ము క్యాన్సర్ పురుషులకి కూడా వస్తుంది.

ఎందుకంటే ప్రతి బిడ్ద తల్లి కడుపులో మొదట స్త్రీ గానే ఉంటుంది.ఆ తరువాత క్రోమోజోమ్స్ ప్రభావం వలన మగ బిడ్డ, ఆడ బిడ్డ ఎవరి క్రోమోజోమ్ కాంబినేషన్ ని బట్టి ఆ లింగానికి మారిపోతారు/ఉండిపోతారు.

Advertisement

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే పురుషులకి నిపుల్స్ ఉండటానికి కారణం అదే.స్త్రీలకు వచ్చే బ్రెస్ట్ మగవారికి కూడా రావొచ్చు.కాని టెస్టికులర్ క్యాన్సర్ కేవలం మగవారికే వస్తుంది.ఎందుకంటే వృషణాలు కేవలం మగవారికే ఉంటాయి.

బ్లాడర్ లో రాళ్ళు :

కిడ్నీల్లో రాళ్ళు లింగభేదం చూసి రావు.అవి స్త్రీలకి అయినా, పురుషులకి అయినా వచ్చేస్తాయి.

కాని బ్లాడర్ లో రాళ్ళు పురుషులకే వస్తాయి.బ్లాడర్ లో మినరల్ బిల్డప్ ఎకువ అవడం వలన లేదా మూత్రం ఎక్కువ మోతాదులో ఆపి ఉంచే అలవాటు ఉండటం వలన ఇవి ఏర్పడతాయి.దీంతో మూత్రంలో మంట, కడుపు నొప్పి ఎలాగో ఉంటాయి, వీరితో పాటు పురుషాంగంలో విపరీతమైన నొప్పి పుట్టవచ్చు.

బట్టతల :

బట్టతలని వ్యాధిగా గుర్తించాలా వద్ద అనే ప్రశ్నను కాసేపు పక్కనపెడితే, ఈ సమస్య్ మాత్రం పురుషులకి వచ్చేదే.మరి స్త్రీలకు వెంట్రుకలు ఊడవా అంటే ఊదుతాయి కాని హెయిర్ ఫాల్ ఉంటుంది, పురుషుల మాదిరి బట్టతల రాదు.

ఈ బట్టతల ఎందుకు వస్తుంది అంటే అతిపెద్ద కారణం జీన్స్.తండ్రికి బట్టతల ఉంటే కొడుక్కి కూడా రావొచ్చు.అమ్మాయిలకి జుట్టు రాలితే దాన్ని బట్టతల అనడం ఎప్పుడైనా విన్నామా ?

ఆల్పోర్ట్ సిండ్రోం :

ఇదేం జబ్బు, దీని గురించి ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా.ఇది చాలా అరుదుగా తలెత్తే సమస్య లెండి.

జీన్స్ వలన వస్తుంది, అందులోనూ కేవలం పురుషుల ప్రాణాలనే తీస్తుంది.ఈ సిండ్రోం వస్తే ఒకేసారి కిడ్నీలు, కనులు, చెవులు పనిచేయడం తగ్గిస్తాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?

సైలెంట్ గా ప్రాణాలు ఎగరేసుకుపోతుంది.మరి ఇది స్త్రీలపై ఎందుకు ప్రభావం చూపదు అంటే, స్త్రీలలో రెండు X క్రోమోజోమ్స్ ఉంటాయి.

Advertisement

కాని పురుషులలో కేవలం ఒకటే X క్రోమోజోం ఉంటుంది కదా.అందుకే పురుషుడి శరీరం ఈ జబ్బు ముందు బలహీనం.

పెరోనిజ్ :

సహజంగా పురుషాంగం కొంచెం ఎడమవైపుకి వంగి ఉంటుంది.దీన్ని చూసి కంగారుపడకండి.

సహజమే అన్నాం కదా.కాని పెరోనిజ్ అనే వింత వ్యాధిని జీన్స్ ద్వారా పొందేవారి పురుషాంగం చాలా ఓవర్ గా వంగిపోతుంది.ఎంతలా వంగుతుంది అంటే వారు శృంగారం చేయడం కష్టం.

అంతే కాకుండా పురుషాంగం సైజు తగ్గిపోతుంది.ఇక అంగస్తంభనల గురించి మరిచేపొండి.

తాజా వార్తలు