చిరంజీవి బాలకృష్ణ ఇప్పటికి ఎన్నిసార్లు తలపడ్డారో ఎవరు గెలిచారో చూడండి

ఖైదీనం 150, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలతో, 16వ సారి బాక్సాఫీస్ వద్ద పోటిపడబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ.ఓసారి వీరిద్దరి పోటి చరిత్ర మీద ఓ లుక్కెయ్యండి.

1984 - మంగమ్మ గారి మనవడు vs ఇంటిగుట్టు ఒక్కరోజులో రెండు సినిమాలు వచ్చాయి.మంగమ్మ గారి మనవడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇంటిగుట్టు యావరేజ్.విజేత బాలకృష్ణ.1984 - శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర vs అగ్నిగుండం ఆరురోజుల తేడాతో రెండు సినిమాలు వచ్చాయి.ఈసారి కూడా బాలకృష్ణ నెగ్గినా, ఈ సినిమా క్రెడిట్ ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిందే.1984 - కథానాయకుడు vs రుస్తుం చిరంజీవి రుస్తుం 7 రోజుల తరువాత విడుదల అయ్యి ఓడిపోయింది.1985 - చట్టంతో పోరాటం vs ఆత్మబలం ఒకేరోజు విడుదలయిన ఈ సినిమాల్లో చిరంజీవి చట్టంతో పోరాటం బాలకృష్ణ సినిమాపై పైచేయి సాధించింది.1986 - భార్గవ రాముడు vs దొంగమొగుడు రెండు సినిమాలు సమానంగా, సూపర్ గా ఆడాయి.ఈసారి ఇద్దరిలో ఎవరిది పైచేయి కాదు.1986 - ముద్దుల కృష్ణయ్య vs మగధీరుడు బాలకృష్ణ ముద్దుల కృష్ణయ్య బంపర్ హిట్ గా నిలవగా, చిరంజీవి సినిమా యావరేజ్ గా నిలించింది.1986 - నిప్పులాంటి మనిషి vs కొండవీటి రాజా వారం వ్యవధిలో విడుదలై, రెండు సినిమాలు బాగా ఆడిన, చిరంజీవి కొండవీటి రాజాతో మరింత పెద్ద హిట్ ని సాధించడంతో ఈ పోటి చిరంజీవి ఖాతాలో వేయవచ్చు.1986 - అపూర్వ సహోదరులు vs రాక్షసుడు మరోసారి వారం వ్యవధిలో విడుదలయ్యాయి.ఈసారి కూడా రాక్షసుడు చిత్రంతో చిరంజీవి పైచేయి సాధించారు.1987 - రాము vs పసివాడి ప్రాణం వారం వ్యవధిలో రెండు సినిమాలు వచ్చి, రెండు బాగా ఆడాయి.1988 - ఇన్స్పెక్టర్ ప్రతాప్ vs మంచిదొంగ ఈసారి కూడా ఇద్దరి సినిమాలు సూపర్ గా ఆడాయి.1997 - పెద్దన్నయ్య vs హిట్లర్ దశాబ్దకాలం తరువాత ఇద్దరు పోటిపడ్డారు.రెండు సినిమాలు బాగా ఆడాయి.1999 - సమరసింహారెడ్డి vs స్నేహంకోసం వారం వ్యవధిలో రెండు సినిమాలు తలపడ్డాయి.బాలకృష్ణ్ సమరసింహారెడ్డితో సరికొత్త రికార్డులు సృష్టిస్తే, చిరంజీవి సినిమా యావరేజ్ గా నిలిచింది.2000 - వంశోద్ధారకుడు vs అన్నయ్య మళ్ళీ వారం గ్యాప్.అయితే ఈసారి విజయం చిరంజీవి దే.2001 - నరసింహానాయుడు vs మృగరాజు బాలకృష్ణు ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకుంటే, మృగరాజు దారుణంగా విఫలమయ్యింది.2004 - లక్ష్మీనరసింహ vs అంజి ఇద్దరు చివరిసారిగా పోటిపడింది ఈ సినిమాలతోనే.ఈసారి కూడా బాలకృష్ణదే విజయం.

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?
Advertisement

తాజా వార్తలు