జీరో షాడో డే.ఈ అరుదైన ఘట్టం ఇవాళ బెంగళూరులో ఆవిష్కతం కానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వెలుతురు ఉంటే నీడ తప్పనిసరిగా ఉంటుంది.కానీ జీరో షాడో డే నేపథ్యంలో పట్టపగలే నీడ కనిపించదని తెలుస్తోంది.
బెంగళూరులో ఒకటిన్నర నిమిషం పాటు నీడ కనిపించదని సైంటిస్టులు చెబుతున్నారు.సూర్యుడు నేరుగా తలపైకి రానుండటంతో నిటారుగా ఉన్న వస్తువుల షాడో కనిపించదు.
ఇటువంటి ఘటనే గతంలో భువనేశ్వర్ లో చోటు చేసుకుంది.అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్ట్ 18న కూడా జీరో షాడో డే వస్తుందని ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తెలిపింది.