హైదరాబాద్, ఆగష్టు 17, 2022:దేశవ్యాప్తంగా వివిధ భాషలలో పేరుగాంచిన డాన్స్ ఇండియా డాన్స్ గత కొంతకాలంగా తెలుగు ప్రేక్షలను ఊరిస్తూవస్తుంది.ఎప్పటికప్పుడు సరికొత్త రియాలిటీ షోస్ తో మెప్పిస్తున్న జీ తెలుగు ఇప్పుడు డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు తో వివిధ సాంసృతిక నేపథ్యం మరియు లైఫ్స్టయిల్స్ కలిగిన 10 జంటలతో ఇరు రాష్ట్రాల ప్రజలను అలరించడానికి సిద్ధమైంది.
ఇప్పటికే రిలీజైన ప్రోమో షో పై అంచనాలు అమాంతం పెంచంగా, ఈ నెల 21 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు మీ ముందుకువస్తూ అందరితో చిందులు వేయించడానికి సిద్ధమైంది.ఇక వివరాల్లోకి వెళితే, ఈ షోకి నటి సంగీత, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, మరియు ఆనంది జడ్జెస్ గా వ్యవహరించబోతుండగా, అకుల్ బాలాజీ మరియు రోహిణి తమ చురుకైన యాంకరింగ్ తో అదరగొట్టనున్నారు.
బ్లాక్ బస్టర్ లాంచ్ ఎపిసోడ్ లో భాగంగా, జడ్జెస్ మరియు అకుల్ బాలాజీ పవర్ఫుల్ డాన్స్ పెర్ఫార్మన్స్ తో స్టేజి పైకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండగా, రోహిణి ఖడ్గం చిత్రంలోని సంగీత పాత్రకి సంబందించిన కాస్ట్యూమ్ లో అలరిస్తూ నవ్వులు పూయించనుంది.జోడిల యొక్క పెర్ఫార్మన్స్ అనంతరం మెంటర్స్ వారిని తమ టీంలోకి తీసుకోవడానికి పోటీపడటం, తీస్ మార్ ఖాన్& చిత్ర యూనిట్ నుండి హీరో ఆది సాయి కుమార్, దర్శకుడు కళ్యాన్జీ గోగణ, సంగీత దర్శకుడు సాయి కార్తీక్ స్పెషల్ ఎంట్రీ, బాబా భాస్కర్ మరియు రోహిణి యొక్క చంద్రముఖి డాన్స్ ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేయనున్నాయి.
ఐతే, ఈ ఆదివారం కేజీఎఫ్ – చాప్టర్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కూడా ఉండడంతో, జీ తెలుగు మీ వారాంతానికి బ్లాక్బస్టర్ ముగింపు పలకనుంది.దేశవ్యాప్తంగా కోట్లాది మంది మనస్సులు గెలుచుకున్న ఈ చిత్రం, సాయంత్రం 5:30కు ప్రసారం కానుంది.
ఈ నెల 21న సాయంత్రం 5:30కు ప్రసారమవుతున్న కేజీఎఫ్ – చాప్టర్ 2, ఇకపై ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు అలరించనున్న డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు షోని
కుటుంబ సమేతంగా తప్పక వీక్షించండి, మీ జీ తెలుగు లో…
.






