‘కృష్ణ కృష్ణ’ కార్యక్రమంతో ఈ కృష్ణాష్టమిని జీ తెలుగుతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోండి Telugu TV Television Shows,News

ఆ చిన్ని కృష్ణుడు ఎప్పుడెప్పుడు మన లోగిలిలోకి వస్తాడా అని సంవత్సరం మొత్తం ఎదురు చూసే రోజు రానే వచ్చింది.కరోనా మహమ్మారి వల్ల దేశమంతా ఎంతో సంతోషంగా జరుపుకునే కృష్ణాష్టమి ఈసారి మాత్రం మన ఇళ్లకే పరిమితమయింది.అందుకే మనకు ఆనందాలను వెదజల్లడానికి జీ తెలుగు ‘కృష్ణ కృష్ణ’ అనే కార్యక్రమంతో మీముందుకు వస్తుంది.ప్రతీ పండుగను తెలుగు ప్రజలతో కలిసి జరుపుకునే జీ తెలుగు, ఈ కృష్ణాష్టమిని కూడా ఆనందోత్సాహల మధ్య నిర్వహిస్తుంది.‘కృష్ణ కృష్ణ’ కార్యక్రమంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది.ఆద్యంతం కన్నుల పండుగలా సాగిన ఈ కార్యక్రమం, ఆదివారం ఆగష్టు 9 న, 6 గంటలకు జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానల్లలో ప్రసారం కానుంది. ‘కృష్ణ కృష్ణ’ కార్యక్రమంలో ఎనర్జిటిక్‌ యాంకర్స్‌ శ్యామల, రవి తమ యాంకరింగ్‌తో అదరగొట్టేశారు.తమ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో పంచ్‌లు వేస్తూ అతిథుల్ని ఆత్మీయంగా ఆహ్వానించారు.

ఇక ఈ కార్యక్రమంలో నిర్వహించిన ఆటలు, పాటలు, ఫన్‌ గేమ్స్‌ మరియు ఉట్టి కొట్టడం అందర్ని విశేషంగా అలరించాయి


హిట్లర్ గారి పెళ్ళాం తారాగణం మరియు సిబ్బంది ‘కృష్ణ కృష్ణ’ కార్యక్రమానికే హైలెట్‌.నిరుపమ్ పరిటాల, గోమతి ప్రియా, సునంద మాలశెట్టి, కీర్తి జైధనుష్, మధుకృష్ణ విచ్చేసి అందర్ని ఆశ్చర్యపరిచారు.మన హిట్లర్ గారి పెళ్ళాం గోమతి ప్రియా ఫిదా సినిమాలోని ‘వచ్చిందే మెల్లగా వచ్చిందే’ అనే పాటకి స్టెప్పులు వేస్తూ, భానుమతి ఒకటే పీస్ అనే డైలాగ్ చేప్పి అందరిని ఉర్రూతలూగించింది.అంతేకాకుండా కృష్ణుడి మీద ఒక మెడ్లీ యాక్టును ఆదర్శ్, ప్రియాంక, అనూష మరియు సత్య నృత్యం చేసి అందరి మన్ననలను పొందారు. ‘కృష్ణ కృష్ణ’ కార్యక్రమంలో భాగంగా యాంకర్ శ్యామల గులాబీ సినిమాలోని పాటని ఎంతో అద్భుతంగా పాడి అందరిని మంత్ర ముగ్ధులను చేసింది.

అలాగే మంగ్లీ కూడా తన గాత్రంతో పండగకు ఒక ఉషారు తీసుకొచ్చింది. మైమరపించే అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌లతో అందరిని ఉర్రూతలూగించే ‘కృష్ణ కృష్ణ’ కార్యక్రమం ఆగష్టు 9 ఆదివారం 6 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానల్లలో.డోంట్‌ మిస్‌ ఇట్‌
మీ ఆప్తులుగా మేము కోరుకునేది ఒక్కటే, జాగ్రత్తగా ఉండండి.మేము అందించే ఎంటర్టైన్మెంట్ ను ఆస్వాదించండి. ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి.

జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.


మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి
జీ తెలుగు గురించి
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEl)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానెల్ తో సౌతిండియాలో ఎంటరైంది సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు. సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.

ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube