రోజురోజుకు కన్నడ రాజకీయాలు( Karnataka elections ) రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలు వచ్చే నెల 10న జరుగుతుండడంతో ఈ పదిహేను రోజులు ఎంతో కీలకం కానున్నాయి.ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చి బరిలో నిలిపాయి.21 నాటికి నామినేషన్స్ వేసే ప్రక్రియ పూర్తి కాగా నేటితో నామినేషన్స్ ఉపసంహరణ కూడా గడువు కూడా పూర్తి కానుంది.ఇక ఇప్పటి నుంచే అసలు ఆట మొదలు కానుంది.ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోయే సమయం వచ్చేసింది.మిగిలిన ఈ పది రోజుల్లో హామీలు, మేనిఫెస్టోలు, విమర్శలు, ఆరోపణలు.అబ్బో ఇలా ఒక్కటేంటి ఎన్నో అంశాలను ప్రజల ముందు పెట్టబోతున్నాయి ప్రధాన పార్టీలు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్( BJP, Congress, JDS ) పార్టీల మద్యనే ప్రధాన పోరు ఉందనే విషయం అందరికి తెలిసిందే.
మరి ముఖ్యంగా తుది పోరు కాంగ్రెస్, బీజేపీ మద్యనే అని విషయం కూడా తెలిసిందే.ఈ రెండు పార్టీలు కూడా పక్కా వ్యూహాత్మకంగా ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డాయి.ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తాం అనే వ్యాఖ్యలతో పాటు ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసే విధంగా ఎలాంటి విమర్శలు చేయాలనే దానిపై కూడా దృష్టి సారించనున్నాయి ప్రధాన పార్టీలు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్( Double engine Sarkar ) నినాదాన్ని ముందుకు తీసుకెళుతూ రైతు ఋణమాఫీ, స్త్రీ ఉన్నతి వంటి హామీలను ఎక్కువగా ప్రస్తావిస్తోంది.అటు వైపు కాంగ్రెస్ పార్టీ లక్ష ఉద్యోగాలు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, మత్స్య కారులకు రూ.10 లక్షల భీమా వంటి .వంటి హామీలతో ప్రచారాన్ని హోరెత్తించే అవకాశం ఉంది.
ఇక జేడీఎస్ కూడా రైతు ఋణ మాఫీ, ఉద్యోగాల రూపకల్పన, పాటశాలల బలోపేతం వంటి హామీలతో ముందుకు సాగుతోంది.అయితే హామీల విషయంలో అని పార్టీలు కూడా ఎడా పెడా మేనిఫెస్టోలను రూపొందించాయి.అయితే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పార్టీలు ఎంతవరకు ఎంరవేరుస్తాయనేదే అసలు ప్రశ్న.ఇక పోతే ప్రచారల్లో భాగంగా విమర్శల ఘాటు కూడా గట్టిగానే గుభాళించనుంది.ముఖ్యంగా అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలే చేసే అవకాశముంది.వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం దొంగిలించే అవకాశాలు ఉన్నాయని కాబట్టి ప్రజలు భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించాలని హస్తం నేతలు ఇప్పటికే అగ్గి రాజేస్తున్నారు.
ఇక ఈ డోస్ రేపటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది.అటు బీజేపీ కూడా రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.
మొత్తానికి రేపటి నుంచి కర్నాటకలో ప్రచార పోరు హోరెత్తనుంది.