ఆ డెసిషన్ తీసుకుంటే.. టీడీపీకి ప్రమాదమే !

వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం టీడీపీ( TDP ) అమితంగా ప్రయత్నిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.గత ఎన్నికల్లో దారుణ ఓటమితో డీలా పడిపోయిన టీడీపీ తిరిగి పుంజుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి.

 If That Decision Is Taken, Is It Dangerous For Tdp?, Tdp, Ap Politics, Ycp, Yuva-TeluguStop.com

మరి ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ వేస్తున్న ప్లాన్స్ ఏంటి ?చంద్రబాబు, లోకేశ్ ఎలాంటి స్టాండ్ తో ముందుకు వెళ్లబోతున్నారు? వైసీపీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టీడీపీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి ? ఇలా చాలా ప్రశ్నలు ఆ పార్టీ చుట్టూ గుప్పుమంటున్నాయి.ముఖ్యంగా ప్రస్తుతం అమలౌతున్న పథకాలపై టీడీపీ స్టాండ్ ఏంటి ? తెలుగుదేశం అధికారంలోకి వస్తే జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు, వ్యవస్థలు అలాగే కొనసాగుతయా ? లేదా రద్దు అవుతాయా ? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమౌతున్నాయి.

Telugu Ap, Chandrababu, Lokesh, Ys Jagan, Yuvagalam-Politics

ప్రస్తుతం లెక్కకు మించిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైసీపీ( YCP ).ఈ పథకాలు ఇలాగే కొనసాగలంటే వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలవాలని, లేదంటే ఇతరులు అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నిటిని రద్దు చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.టీడీపీ కూడా తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలౌతున్న చాలా పథకాలను రద్దు చేసి ప్రజాధనాన్ని వెస్ట్ చెయ్యమని చెబుతున్నారు తెలుగుదేశం శ్రేణులు.అయితే పథకాల విషయం అలా ఉంచితే సచివాలయ వ్యవస్థ, వాలెంటరీ వ్యవస్థలపై టీడీపీ స్టాండ్ ఏంటి అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.

ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ మరియు వాలెంటరీ వ్యవస్థ ఏపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నాయి.ప్రజలకు, ప్రభుత్వానికి వారదిలా పని చేస్తున్నాయి.దాంతో ఈ రెండు వ్యవస్థలపై ప్రజల్లో కూడా ఎంతో సానుకూలత ఉంది.

Telugu Ap, Chandrababu, Lokesh, Ys Jagan, Yuvagalam-Politics

అయితే టీడీపీ అధికారంలోకి వస్తే వాలెంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ రద్దయ్యే అవకాశం ఉందనే వార్తలు ఎప్పటి నుంచే వినిపిస్తున్నాయి.ఈ వ్యవస్థలను రద్దు చేసేవిధంగా టీడీపీ అడుగులేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఏపీ ప్రజలు వైసీపీకె పట్టం కడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకే ఈ రెండు వ్యవస్థలపై టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

సచివాలయ వ్యవస్థను, అలాగే వాలెంటరీ వ్యవస్థను రద్దు చేయకుండా పంచాయతిలకు అనుసంధానం చేయాలని భావిస్తునట్లు తెలుస్తోంది.

Telugu Ap, Chandrababu, Lokesh, Ys Jagan, Yuvagalam-Politics

ఇదే విషయాన్ని ఇటీవల నారా లోకేశ్ కన్ఫర్మ్ చేశారు( Nara lokesh ) కూడా.దీన్ని బట్టి చూస్తే సచివాలయ వ్యవస్థ మరియు వాలెంటరీ వ్యవస్థను రద్దు చేసే సాహసం టీడీపీ చేయబోదనే విషయం అర్థమౌతోంది.ఆ దిశగా ఆలోచన చేసిన టీడీపీకి అది ప్రమాదమే అని భావనలో బాబు ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే తెలివిగా వాటిని పంచాయతీలతో కలిపే ప్రయోగం చేసేందుకు టీడీపీ మొగ్గు చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube