నెల్లూరు జిల్లాలోకి ‘యువగళం’ పాదయాత్ర

టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఇవాళ నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టనుంది.

ఈ మేరకు మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద పాదయాత్ర ప్రవేశించనుంది.

ఈ నేపథ్యంలో లోకేశ్ కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.సాయంత్రం కదిరినాయుడుపల్లిలో స్థానికులతో లోకేశ్ సమావేశం కానున్నారు.

కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33 రోజులపాటు పాదయాత్ర కొనసాగనుండగా ఆత్మకూరు నియోజకవర్గంలో సుమారు మూడు రోజుల పాటు సాగనుంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

Latest Latest News - Telugu News