తెలంగాణలో వైఎస్ఆర్టీపీ వడివడిగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించే పనిలో నిమగ్నమైంది.
తాజాగా ఖమ్మం జిల్లా పాలేరులో వైఎస్ఆర్టీపీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు.ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పార్టీ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించనున్నారు.
ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి చర్చ్ సమీపంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు.ఈ భూమి పూజ కార్యక్రమానికి భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు.
అయితే షర్మిల పాలేరు నుంచే పోటీ చేయనున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అదేవిధంగా వచ్చే ఎన్నికల నేపథ్యంలో త్వరలో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
షర్మిల పాలేరు ఎంట్రీతో కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.