తెలంగాణ లో ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు గత ఏడాది అక్టోబర్ 20 న చేవెళ్ల గడ్డ నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.
మధ్యలో కరోనా థర్డ్ వేవ్… స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా నవంబర్ 9 నుంచి 2022 మార్చ్ 10 వరకు విరామం ప్రకటించారు.కరోనా పరిస్థితులు అనుకూలించడం తో తిరిగి ఈ ఏడాది మార్చ్ 11 నుంచి పాదయాత్ర పునఃప్రారంభం అయ్యింది.75 రోజులుగా పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం ఆయిన పాదయాత్ర నల్గొండ జిల్లా మీదుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతోంది.అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ,ప్రజలకు ఏం కావాలో అక్కడికక్కడే హామీలు ఇస్తూ సాగుతున్న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర రేపు మే 5 కి 76 వ రోజు వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటోంది.ఈసందర్భాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గం తాళ్ళమడ గ్రామం దగ్గర వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర కి గుర్తుగా రేపు సాయంత్రం 4గంటలకు 25అడుగుల పైలాన్ ను వైఎస్ షర్మిల ఆవిష్కరిస్తారు.అనంతరం సత్తుపల్లి పట్టణం లో 5గంటలకు భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
![Telugu Feet Pilon, Corona Wave, Farmers, Khammam, Sharmila, Telangana, Ys Sharmi Telugu Feet Pilon, Corona Wave, Farmers, Khammam, Sharmila, Telangana, Ys Sharmi](https://telugustop.com/wp-content/uploads/2022/05/YS-Sharmila-Praja-Prasthanam-Padayatra-Meeting-with-Farmers.jpg)
ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 20నియోజక వర్గాలలో 13మున్సిపాలిటీలలో,51 మండలాలలో,503గ్రామాల లో ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగింది.దానిలో భాగంగా 16 బహిరంగ సభలు, 47 ప్రాంతాలలో ప్రజలతో మాటముచ్చట కార్యక్రమాలు,11 చోట్ల నిరుద్యోగ దీక్షలు, ఆరు సార్లు వడ్ల కొనుగోలుకై ధర్నాలు, 18 చోట్ల రైతు గోస ధర్నాలు ,చేనేత సమస్యల పై ఆత్మీయ సదస్సు లను వైఎస్ షర్మిల నిర్వహించారు.