తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీకి దూరంగా ఉండనుందని తెలుస్తోంది.ఈ మేరకు కాసేపటిలో పార్టీ నేతలతో పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీకానున్నారు.
ఇందులో భాగంగా ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీ పోటీ చేయనుందా? లేదా? అన్న దానిపై క్లారిటీ రానుంది.అయితే పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు షర్మిల గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈనెల 6వ తేదీన పాలేరులో నామినేషన్ దాఖలు చేస్తానని కూడా ప్రకటించారు.అయితే తాజాగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీ పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పోటీ అంశంపై షర్మిల నేతలతో సమావేశం తరువాత క్లారిటీ రానుంది.