ఏపీలో ట్రయాంగిల్ పోరును కోరుకుంటున్న వైకాపా

ఆంధ్ర ప్రదేశ్‌( Andhra Pradesh ) లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది.2019 ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ అధికార పార్టీగా ఎన్నికల బరిలో నిలిచింది.వైకాపా ప్రధాన ప్రతిపక్ష హోదాను కలిగి ఉంది ఎన్నికలో పాల్గొంది.ఇక జనసేన పార్టీ( Janasena party ) ఆ ఎన్నికల్లో మొదటి సారి పాల్గొంది.అధికార పార్టీ కాస్త ప్రతిపక్ష పార్టీగా టీడీపీ( TDP ) మారింది.ఇక ప్రతిపక్ష పార్టీ వైకాపా కాస్త అధికార పార్టీగా నిలిచింది.

 Ysrcp Want Triangle Elections In Andhra Pradesh , Andhra Pradesh, Ysrcp, Ap New-TeluguStop.com

కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క సీటును దక్కించుకుంది.అంతే కాకుండా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా పరాజయం మూట కట్టుకున్నాడు.

అందుకే 2024 అసెంబ్లీ ఎన్నికల విషయంలో ట్రై యాంగిల్‌ పోరు వద్దని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నాడు.అందుకే తెలుగు దేశం పార్టీ తో పొత్తుకు సిద్ధం అన్నట్లుగా పలు సందర్భాల్లో చెప్పుకుఒచ్చాడు.

ఒక వేళ బీజేపీ తో కలిసి ఉండి ఎన్నికలకు వెళ్తే కూడా ట్రై యాంగిల్ పోరు అవుతుంది.

Telugu Ap, Bjp, Telugu Desam, Ysrcp-Telugu Political News

ట్రై యాంగిల్‌ పోరు కచ్చితంగా వైకాపాకు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒక వేళ తెలుగు దేశం పార్టీ( Telugu Desam Party ) మరియు జనసేన పార్టీ లు కలిస్తే కచ్చితంగా రాజకీయం రసవత్తరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.వైకాపా మాత్రం బలంగా ట్రై యాంగిల్‌ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు.

కానీ తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ లు మాత్రం ట్రై యాంగిల్‌ పోరును కోరుకుంటున్నారు.బీజేపీ తో పొత్తు వదులకుని అయినా కచ్చితంగా తెలుగు దేశం పార్టీ తో వెళ్లాలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు అంటే ఏ స్థాయిలో ఆయన పొత్తు విషయం లో సీరియస్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా జాగ్రత్త పడుతూ పొత్తు లో వెళ్లాలి అనుకుంటున్నారు.ముఖ్య మంత్రి సీటు ఆశించకుండా పొత్తుకు ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube