వీరి దెబ్బకు వైసీపీ షేక్ అవుతోందా ?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో అసంతృప్త నేతలు పెరిగిపోతున్నారు.పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా,  తమకు సరైన ప్రాధాన్యం దక్కలేదని, తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని ,ఇలా ఒక్కో నేత తన అసంతృప్తిని బయటకు వెళ్ళగకుతూ, పార్టీ అధిష్టానం పైన,  ప్రభుత్వం తీరుపైన నేరుగా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది.

 Ysrcp Nelluru Politics Kotamreddy Sridhar Reddy , Ysrcp, Ap,nelluru Rural Mla,-TeluguStop.com

ఇప్పటికే  వెంకటగిరి వైసిపి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి ఈ తరహా విమర్శలు చేసి, పార్టీలో ఇక ఉండేది లేదు అన్నట్లుగా తేల్చేశారు.దీంతో అక్కడ నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని వైసీపీ ఇన్చార్జిగా వెంటనే నియమించారు.

ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళగక్కుతూ పార్టీ అధిష్టానం పై ధిక్కార స్వరం వినిపించారు.

Telugu Anamramnarayana, Ap Cm Jagan, Ap, Jagan, Kotamsridhar, Nelluru, Ysrcp-Pol

 తన కదలికలపై నిఘా పెట్టారని,  తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  ఇక తాను పార్టీ వీడి వెళుతున్నాను అన్న సంకేతాలను ఆయన ఇవ్వడంతో వైసీపీలో కలకలం రేపింది.ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు.

వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడుస్తూ వస్తున్నారు.అయితే మంత్రి మండలిలో స్థానం దక్కకపోవడంతో ఆయన అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉంటున్నారు.

ఇప్పుడు బయటకు వెళ్తున్నారు.ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట.2019 ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.ఇప్పుడు అదే జిల్లా నుంచి ఒక్కో ఎమ్మెల్యే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ పార్టీని వీడేందుకు సిద్ధమవుతుండడం వైసిపి అధిష్టానం కి కూడా ఆందోళన కలిగిస్తోంది.

Telugu Anamramnarayana, Ap Cm Jagan, Ap, Jagan, Kotamsridhar, Nelluru, Ysrcp-Pol

 ఒకవేళ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తే అక్కడ ఇన్చార్జిగా ఎవరిని నియమించాలనే విషయం పైన అప్పుడే వైసిపి ఫోకస్ పెట్టింది.ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేతల రామకృష్ణారెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో సమావేశం అయ్యారు.శ్రీధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తే నెల్లూరు రూరల్ ఇంఛార్జి గా గిరిధర్ రెడ్డిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇంకా అనేక జిల్లాల్లో ఈ తరహా అసంతృప్తులు ఉండడంతో నియోజకవర్గాల వారీగా ఎవరెవరు పార్టీ పైన, ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారు ?  వారు పార్టీ మారాలని చూస్తున్నారా అనే విషయంపై వైసీపీ ఇప్పుడు అంతర్గతంగా ఆరా తీస్తోందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube