కార్పొరేషన్ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తమకు అందివచ్చిన విధంగా దూకుడు ప్రదర్శిస్తు న్నాయి.ఈ విషయంలో టీడీపీ కంటే.
వైసీపీలో దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీ కీలక నాయకు డు, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్.
సాయిరెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం విశాఖ కార్పొరేషన్ ఎన్నికలను తనకు, పార్టీకి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాయిరెడ్డి.
ఇక్కడ అన్ని వర్గాలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.విశాఖను గెలిపించుకునేందుకు ఆయన శాయ శక్తులా కృషి చేస్తున్నారు.
కొన్ని రోజుల కిందట విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీ కరణను వ్యతిరేకిస్తూ.పాదయాత్ర చేశారు.ఎన్నిక ల్లో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికీ ప్రచారం చేశారు.ఇప్పుడు తాజాగా ఎన్నికలకు మరికొన్ని గంటలే ఉండడంతో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ఒకే రోజు.ఆయన రెండు కీలక సామాజి క వర్గాలతో విశాఖలో భేటీ అయి.పార్టీ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది.బీసీ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయిన సాయిరెడ్డి.
అధికార పార్టీకి ఓటేయాల ని పిలుపునిచ్చారు.

అదే సమయంలో అత్యంత కీలకమైన కమ్మ సామాజిక వర్గం నేతలతోనూ సాయిరెడ్డి భేటీ అయ్యారు.ఇలా సామాజిక వర్గాలను వైసీపీ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేయడం గమనార్హం.అయితే.
ఇప్పుడున్న పరిస్థితి లో ఏమేరకు వారు వైసీపీ కి సహకరిస్తారు? అనేది కీలకంగా మారింది.అయితే.
సాయిరెడ్డి వైఖరిపై కొందరు అనుకూలంగా కామెంట్లు చేస్తుండగా.మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
బీసీల సమస్యలపై గతంలో వారు అనేక మొమొరాండంలు ఇచ్చారు.అయితే.
అప్పట్లో వాటిని సాయిరెడ్డి పక్కన పడేశారు.
ఇక, ఇప్పుడు మాత్రం ఎన్నికలకు ముంగిట.
వారిని దువ్వే కార్యక్రమం చేపట్టడం గమనార్హం.మరోవైపు కమ్మ సామాజిక వర్గాన్ని నిన్న మొన్నటి వరకు తిట్టిపోసిన.
సాయిరెడ్డి.కేవలం ఈ సామాజిక వర్గం కోసమే రాజధాని నిర్మించారని చెప్పిన సాయిరెడ్డి… ఇప్పుడు మాత్రం ఇదే సామాజిక వర్గాన్ని తమవైపునకు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం.
మరి ఈ రెండు సామాజిక వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.