ఆ జిల్లాని వైసీపీ నేత‌లు అలా పంచేసుకున్నారా..?

ఔను! ఆ జిల్లాలో అధికార పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇదే సందేహానికి దారి తీస్తోంది.

రాజ‌ధాని జిల్లాగా గుర్తింపు తెచ్చుకున్న గుంటూరులో వైసీపీ నాయ‌కులు జిల్లాను విభ‌జించి పాలిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఎక్క‌డైనా క‌లిసి మెలిసి ప‌నిచేసుకోవ‌డం అనేది ఉంటుంది.కానీ, ఈ జిల్లాలో మాత్రం ఎవ‌రికి వారు.

ఎక్క‌డిక‌క్క‌డ‌.చ‌క్రం తిప్పుతున్నారే త‌ప్ప‌.

క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.పైగా త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోకి వేరే వారి ప్ర‌మేయాన్ని కూడా స‌హించ‌లేక పోతున్నారు.

Advertisement

జిల్లాలో మూడు ఎంపీ స్థానాలుంటే.రెండు వైసీపీ నేత‌ల‌కే చెందిన‌వి.

వీటిలో ఏ ఎంపీకి ఆ ఎంపీ చ‌క్రం తిప్పుతున్నారు.ఇక‌, ఎమ్మెల్యేల సంగ‌తి కూడా ఇలానే ఉంది.

సీనియ‌ర్లు స‌రేస‌రి.జూనియ‌ర్లు.

తొలిసారి విజ‌యం సాధించిన నాయ‌కులు కూడా త‌మ‌దైన శైలిలో సీనియ‌ర్ల‌ను మించిపోయిన రాజ‌కీయాలు చేస్తున్నారు.చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ప‌నిచేయాల‌న్నా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఎమ్మెల్యే అంగీక‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.ఇక‌, తాడికొండలోను ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

Advertisement

ఇక‌, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నాయ‌కుల మ‌ధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.ప్ర‌త్తిపాడు, వేమూరు వంటి ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న విధంగా నాయ‌కులు చ‌క్రం తిప్పుతున్నారు.

దీంతో ఎక్క‌డిక‌క్క‌డ‌.ప‌నులు ముందుకు సాగ‌డం లేదు.

ఫ‌లితంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా మారిపోయింది.పైగా త‌మ త‌మ నియోజ‌వ‌క‌ర్గాల్లో వేరే వారి ప్ర‌మేయాన్ని కూడా నాయ‌కులు స‌హించ‌లేక‌పోతున్నారు.

అప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రం తిప్పిన నేత‌లకు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు హ‌ద్దులు  నిర్ణ‌యిస్తున్నారనే ప్ర‌చారం జ‌రుగుతోంది.ఈ ప‌రిణామాల‌తో గుంటూరు జిల్లాను వైసీపీ నాయ‌కులు పంచుకున్నారా ? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మొత్తానికి రాజ‌ధాని జిల్లాలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయ‌నేది వాస్త‌వం.

తాజా వార్తలు