ఏపీలో కాపులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు.ఈ క్రమంలో ఇవాళ వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను విడుదల చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అక్కాచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు.
అర్హులైన సుమారు 3,57,844 మంది లబ్దిదారుల ఖాతాల్లోకి నగదును సీఎం జగన్ వర్చువల్ గా జమ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాపు నేస్తం ద్వారా పేద అక్కాచెల్లెమ్మలకు లబ్ది చేకూరుతుందన్నారు.ఎక్కడా లంచాలకు తావు లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.కాపు నేస్తం పథకంతో సుమారు నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరిందన్న సీఎం జగన్ 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు అండగా నిలిచామని తెలిపారు.అంతేకాకుండా వరుసగా నాలుగో ఏడాది కాపు నేస్తం అమలు చేస్తున్నామని వెల్లడించారు.







