మంత్రి భూ..కబ్జాలపై విచారణ!!

టీడీపీపై పోరాటాన్ని వైకాపా ఉధృతం చేస్తుంది.వీలైనంతవరకు ఆ పార్టీని ఏకి పారెయ్యాలి అని వైకాపా స్పష్టమైన ప్లాన్ తో ముందుకు పోతున్నట్లు కనిపిస్తుంది.

ఇక విషయానికి వస్తే నెల్లూరు వైకాపా నాయకులు రెచ్చిపోయారు.అవకాశం దొరుకినప్పుడల్లా తెలుగుదేశంపై విరుచుకు పడుతున్నారు.

అంతేకాకుండా తమపై దుష్ప్రచారం జరుగుతుంది అంటూ వాపోతున్నారు.తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.

నెల్లూరులో మంత్రి నారాయణ భూ కబ్జాలు ఎక్కువయ్యాయి అని, వాటిని తగ్గించాలి అని, అంతేకాకుండా వాటిపై విచారణ జరిపించి మంత్రిపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు.ఇక మరో వైకాపా నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.

Advertisement

విద్యుత్ చార్జీల పెంపుతో పాటు చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామని మీడియాకు తెలిపారు.అంతేకాకుండా గూడురు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వైఎస్ఆర్ సీపీ వీడే ప్రసక్తేలేదని, కొన్ని చానల్స్ దుప్ప్రచారం చేస్తున్నాయని మండి పడ్డారు.

ఏది ఏమైనా వైకాపా ఇంకా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది.మరి దీన్ని ప్రజలు గమనిస్తారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు