తూర్పు గోదావరి వైకాపా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వైకాపా నుంచి తోలగుతారు అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది కానీ దానికి సంబంధించి ఎక్కడా కంక్లూజన్ రావడం లేదు.ఒక పక్క ఆ వార్తలని వైకపా ఖండిస్తూ ఉంటే ఇప్పుడు జర్గాలిసింది అంతా జరిగింది.
ఆది రెడ్డి టీడీపీ లో చేరుతున్నారు అన్న వార్త నిజంగా నిజం అయ్యింది.ఆయన వైకపా కి రాజీనామా చేసేసారు.
కాగా వైసీసీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అందరు నేతల్లానే ఆదిరెడ్డి కూడా కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు.వైసీపీ బలంతో గెలుచుకున్న ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.
ఈ నెల 22న చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు.కాగా ఇప్పటికే ఆయన రాజమండ్రిని చంద్రబాబు ప్లెక్సీలతో నింపేశారు.
ఆదిరెడ్డి ఇంటి ఏరియాతో పాటు సిటీలోని ప్రధాన ప్రాంతాలన్నీ ఆదిరెడ్డి చంద్రబాబులున్న ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలతో నిండిపోయాయి.