విసాఖా ఎయిర్ పోర్ట్ లో తనపై జరిగిన దాడి నేపథ్యంలో ఏపీ పోలీసుల పక్షపాత దర్యాప్తుపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతను ఏపీ ప్రభుత్వ నియంత్రణలో లేని ఏదైనా స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తనపై జరిగిన హత్యాయత్నంలో పెద్ద కుట్ర దాగి ఉందని రిట్ పిటిషన్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.అయితే… వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌పై సైతం హైకోర్టులో విచారణ జరిగింది.గతంలో దాఖలు అయిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది.







