తెలంగాణాలో టీడీపీ ఉనికే కోల్పోయింది అనుకుంటున్నా సమయంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు తన మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించుకుని టీడీపీకి బద్ద శత్రువైన కాంగ్రెస్ తో జతకలిసి మహాకూటమి అంటూ మిగతా పార్టీల జతన చేరిపోయాడు.మొదట టీడీపీకి అక్కడ ఒక్క సీటు కూడా కష్టమే అన్న పరిస్థితి నుంచి టీఆర్ఎస్ ని భయపెట్టే రేంజ్ కి టీడీపీ మైలేజ్ పెంచాడు చంద్రబాబు.
అక్కడ వరకు బాగానే ఉన్నా.అసలు కీలకమైన ఏపీలో ఏం చేస్తాడో అనేది అందరిలోనూ ఒకటే ఉత్కంఠ కనిపించింది.
ఇక్కడ ఎలాగూ త్రిముఖ పోరు తప్పేలా లేకపోవడంతో బాబు డైలమాలో పడ్డాడు.ఎదో ఒక పార్టీతో జత కట్టకపోతే గెలుపు కష్టమనే భావనలో ఉన్న ఆయన కమ్యూనిస్టులతో చర్చలు సాగిస్తున్నాడు.

ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కమ్యూనిస్టుల పెద్దలను కూడా చంద్రబాబు కలుస్తున్నారు.ఈనేపథ్యంలో తాజాగా ఏపీలోనూ కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల కూటమి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.కేంద్రంలో మోడీ, ఏపీలో జగన్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ వ్యూహాలకు తెరలేపాడు.ఏపీలోనూ మహాకూటమి ఏర్పాటు చేయబోతున్నట్టు టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్‌కు, కమ్యూనిస్టులకు ఎన్నిసీట్లు కేటాయించాలన్న దానిపై ఒక ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలుస్తోంది.ఏపీలో కాంగ్రెస్‌కు 25 అసెంబ్లీ, ఐదు ఎంపీ స్థానాలను కేటాయించడంతో పాటు.
వామపక్షాలకు 10 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు ఒకే చెప్పడంతో పొత్తు ఒకే అయినట్టు సమాచారం.

కూటమి పొత్తులో భాగంగా కర్నూలు ఎంపీ స్థానం నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కాకినాడ నుంచి పల్లంరాజు పోటీ చేసేందుకు అవకాశం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.సీపీఐ, సీపీఎంకు చెరో పార్లమెంట్ స్థానం ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని సమాచారం.మోడీ పాలనలో దేశం నాశనం అవుతోందని.
కాబట్టి దేశాన్ని కాపాడుకునేందుకు టీడీపీతో చేతులు కలుపుతున్నట్టు కాంగ్రెస్, కమ్యూనిస్టులు సాకుగా చెప్పుకుంటే సరిపోతుందన్న భావనకు వచ్చారు.కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే .? టీడీపీతో పొత్తుకు వామపక్ష పార్టీల అగ్రనేతలు ఒకే చెబుతుండగా… ఇక్కడి నేతల చూపు మాత్రం జనసేన వైపు ఉంది.







