మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై వచ్చే సోమవారం తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది .నవంబర్ 21న (నేడు) తీర్పును వెలువరిస్తామని గతంలో ప్రకటించిన సుప్రీంకోర్టు మరో వారం పాటు వాయిదా వేసింది.
ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని గతంలో భారత సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడి, కేసును ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు అంగీకరించింది.
ఈ కేసును ఏ రాష్ట్రం నిర్వహించాలనేది తీర్పును ఇవ్వనుంది.కేసును తెలంగాణకు బదలాయించవద్దని సీబీఐ సుప్రీంకోర్టును కోరింది.
కర్ణాటకకు బదీలి చేయాలని తెలిపింది.జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండడమే దీనికి కారణం కావచ్చు.సీబీఐ కొరిక మేరకు ఈ కేసును కర్ణాటకు బదీలి చేయవచ్చని తెలుస్తుంది.2019 ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యారు వైఎస్ వివేకానంద రెడ్డి .
2019 ఎన్నికల ప్రచారంలో జగన్ ఈ సంఘటనను ప్రచార ఆస్త్రంగా వాడుకుని టీడీపీని తప్పుబడుతూ వచ్చారు.ఎన్నికల తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఈ కేసుపై సీరియస్ లేకుండా వ్వవహరించింది.
అలాగే ఈ కేసులో వైసీపీ నేతలు అనుమానితులుగా పేర్కొంటూ జగన్ ప్రభుత్వం వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని వివేకా కుమార్తె సూటిగా ఆరోపించారు.

ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీం కోర్టు కూడా ఆమెతో ఏకీభవించింది.ముఖ్యమంత్రి తన బాబాయి హత్యకేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించలేకపోవడంతో ఈ విషయంలో వైసీపీ నేతలు కూడా జగన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.దాదాపు మూడేళ్ళుగా ఈ కేసు విచారణ జరుగుతుంది.
నిందితులు పట్టుకోవడంలో జాప్యం జరుగుతుంది.ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న సీబీఐపై స్థానిక నేతల నుండి ఓత్తిడి వస్తుంది.
దీంతో వారు స్వతంత్రం విచారణ జరపలేకపోతున్నారు
.