పులివెందుల లో వైఎస్ వివేకానంద కూతురు వైయస్ సునీత డోర్ క్యాంపెనింగ్ మొదలుపెట్టారు.ప్రతి ఇల్లు తిరుగుతూ షర్మిల కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ వైయస్ వివేకానంద రెడ్డి కి అన్యాయం జరిగిందని అతి దారుణంగా వివేకానంద రెడ్డి ని గొడ్డలి తో కొట్టి నరికి నరికి చంపారని.ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా న్యాయం జరగలేదని వైయస్ వివేకకు న్యాయం చేయాలంటే మే 13 వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి షర్మిలను గెలిపించాలని కోరారు.
న్యాయం ప్రజలందరికీ తెలుసని షర్మిలకు కచ్చితంగా ఓటు వేస్తారని నమ్మకం ఉందని అన్నారు.ప్రజలలో తిరుగుతుంటే నాకు వారికి కండ్ల కు నీళ్లు వస్తున్నాయని కానీ అది చెప్పుకునే ధైర్యం లేదని 40 సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉందని ఆ బాధ రేపు ఓటు రూపంలో బయటపడుతుందని అన్నారు.
ఈరోజు ప్రజల్లో తిరుగుతోటే చాలా ధైర్యం వస్తుందని అన్నారు.ప్రజలు న్యాయం వైపు ఉన్నారని నమ్మకం కలుగుతుందని అన్నారు.
రోజురోజుకు ప్రేమ ఆప్యాయత ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు.ఇటీవల వైయస్ వివేకానంద రెడ్డి వీడియో రెండు రోజులుగా వైరల్ అవుతుందని.
నేను పోరాడుతున్నది వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో పోరాడుతున్నానని వైయస్ వివేకాను అవమానం పరచడానికి ఆ వీడియోను బయటపెట్టరని.సంజయిసి చెప్పుకోలేని పరిస్థితిలో ఇలాంటి వీడియోలు బయట పెడుతున్నారని అన్నారు.