వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్సార్ షర్మిల ( YSR Sharmila )కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవటంలో డీకే శివకుమార్( DK Sivakumar ) ప్రముఖ పాత్ర పోషించటం తెలిసిందే.
ఆయన వైఎస్ఆర్ ని అధికంగా అభిమానించే నాయకుడు కావడంతో వైయస్ షర్మిలనీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.అయితే వస్తున్న వార్తలపై వైయస్సార్ షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“వైఎస్ షర్మిల రెడ్డి ( YS Sharmila Reddy )తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది.ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి.పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే.నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి.అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి.
కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి.నా భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే.
జై తెలంగాణ” అని స్పష్టం చేయడం జరిగింది.దీంతో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.