వాళ్లను వెంటనే అరెస్టు చేయాలంటున్న వైయస్ షర్మిల..!!

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో వైయస్సార్ విగ్రహాన్ని కూల్చివేసిన వాళ్లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.వైయస్సార్ విగ్రహాలను కూల్చిన పెరికిపందల్లారా ఖబర్దార్ అంటూ షర్మిల ట్విట్టర్ లో హెచ్చరించారు. “ఖబడ్దార్.YSR విగ్రహాలను కూల్చిన పిరికి పందల్లారా! ప్రజల్లో మీకు మొఖం చెల్లక.

 Ys Sharmila Wants To Arrest Them Immediately ,ys Sharmila, Ysrtp,ys Sharmila Wan-TeluguStop.com

మిమ్మల్ని ప్రజలు చీదరించుకుంటున్నారని.అసహనంతో YSR విగ్రహాలను కూల్చుతున్నారా? YSR తెలంగాణ పార్టీకి వస్తున్న ఆదరణను తట్టుకోలేక.మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని దౌర్బాగ్యుల్లారా.

ఎదురుగా వచ్చి పోరాడే దమ్ము లేదు గానీ వైయస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారా? మీకు దమ్ముంటే మాతో చర్చకు రండి.చర్చించే దమ్ములేని దద్దమ్మల్లారా.మీరు విగ్రహాలు కూల్చినంత మాత్రాన.

జనం గుండెల్లో కొలువైన వైయస్ రాజశేఖర రెడ్డి గారి స్థానాన్ని ఎవరూ కూల్చలేరు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వైయస్ఆర్ విగ్రహాన్ని కూల్చిన వెధవలను వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ఈ చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని .మరొక్కసారి హెచ్చరిస్తున్నాం”…అని షర్మిల మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube