గౌతమ్ గంభీర్ అభిమానులకు శుభవార్త... గంభీర్ ఖాతాలో మరో అరుదైన టైటిల్!

గౌతమ్ గంభీర్ పరిచయం అక్కర్లేదేమో.టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ MP అయినటువంటి గౌతమ్ గంభీర్ మరో టైటిల్ ని చేజిక్కించుకున్నాడు.

 Good News For Gautam Gambhir Fans Another Rare Title In Gambhir's Account , Gow-TeluguStop.com

అవును, IPLలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ను 2 సార్లు ఛాంపియన్‌గా నిలిపిన గౌతమ్ గంభీర్, కెప్టెన్‌గా మరో జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు.అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా రోజులవుతున్నా.

తన సారథ్యంలోని సత్తా తగ్గలేదని నిరూపించిన సంగతి అందరికీ విదితమే.ఓ మాజీ క్రికెటర్‌గా తరుచూ.

ఆయా జట్ల కెప్టెన్లను విమర్శించే గంభీర్.మాటలు చెప్పడం కాదు ఆడి గెలవడం కూడా వచ్చని యువ ఆటగాళ్లకు తన విజయంతో చాటి చెప్పాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించిన గంభీర్.తన దృష్టిలో టైటిల్ సాధించలేని వాడు గొప్ప కెప్టెనే కాదని అప్పుడప్పుడు చెవాక్కులు పేల్చుతూ ఉంటాడు.

IPL తరహాలో అలనాటి ఆటగాళ్లతో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ రెండో ఎడిషన్ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.ఈ సీజన్ లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్లో గౌతమ్‌ గంభీర్‌ సారథ్యంలోని ఇండియా క్యాపిటల్స్‌ విజేతగా నిలిచింది.

అవును, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాస్‌ టేలర్‌ (41 బంతుల్లో 4ఫోర్లు, 8 సిక్స్‌లతో 82), మిచెల్‌ జాన్సన్‌ (35 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్స్‌లతో 62), ఆష్లే నర్స్‌ (19 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్స్‌లతో 42 నాటౌట్‌) చెలరేగడంతో బిల్వారా కింగ్స్‌ను 104 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్‌ చిత్తుకింద ఓడించింది.

21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న జట్టుకు భారీస్కోరు అందించిన ఘనత టేలర్‌, జాన్సన్‌, నర్స్‌లదే అని చెప్పుకోవాలి.బిల్వారా బౌలర్లలో రాహుల్‌శర్మ (4/30), మాంటీ పనేసర్‌ (2/13), టిమ్‌ బ్రెస్నన్‌ (1/11) సఫలమయ్యారు.అనంతరం బిల్వారా కింగ్స్‌ 18.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది.ఆ జట్టులో షేన్‌ వాట్సన్‌ (27; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌లతో) అత్యధిక స్కోరర్‌.

క్యాపిటల్స్‌ బౌలర్లలో జాన్సన్‌ (1/26), పవన్‌ సుయాల్‌ (2/27), ప్రవీణ్‌ తంబె (2/19), ప్లంకెట్‌ (1/15), పంకజ్‌సింగ్‌ (2/14), రజత్‌ భాటియా (1/2) రాణించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube