జనవరి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ వైయస్ షర్మిల( YS Sharmila ) జాయిన్ కావడం తెలిసిందే.ఆ తర్వాత జనవరి 21వ తారీకు ఏపీ పీసీసీ చీఫ్( AP PCC Chief ) బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
ఈ క్రమంలో నేటి నుండి శ్రీకాకుళం నుండి ఇడుపులపాయ వరకు కాంగ్రెస్ పార్టీ( Congress Party ) బలోపేతం చేసే దిశగా వైఎస్ షర్మిల యాత్ర చేస్తూ ఉంది.నేడు శ్రీకాకుళంలో ఈ యాత్ర మొదలయ్యింది.
కాగా నేడు శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో వైయస్ షర్మిల సంక్షేమ వ్యాఖ్యలు చేశారు.
పార్టీ బలోపేతం చేయడానికి పనిచేసే ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు.ఇదే సమయంలో ప్రత్యేక హోదా( Special Status ) విషయంలో మెడలు వంచుతానని చెప్పినా జగనన్న.గారు.
( Jagan ) కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.అనంతరం ట్విట్టర్ లో “ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది.
సమావేశంలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని వారికి భరోసా కల్పించడం జరిగింది.
YSRకి కాంగ్రెస్ ఎంత బలమో.ఆయనకీ కాంగ్రెస్ పార్టీ అంతే బలం.ఆయనను అవమానించిన పార్టీ అని కొందరు విమర్శలు చేస్తున్నారు.ఆ విమర్శల్లో నిజాలు లేవు.వైఎస్‌ఆర్ అంటే ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానానికి అభిమానం ఉంది.అది తెలియక చేసిన తప్పు కానీ.తెలిసి చేసింది కాదు.
ఆ విషయాన్ని స్వయంగా సోనియా గాంధీయే నాకు చెప్పారు.రాజీవ్ గాంధీ చనిపోయాక కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు పెట్టిన సంగతి సోనియా గాంధీ గారు గుర్తు చేసారు” అని వైయస్సార్ అంటే కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేకమైన అభిమానమని వైయస్ షర్మిల ట్వీట్ చేశారు.