వై. ఎస్. షర్మిల ఏ జిల్లా నుండి పోటీ చేయనుందంటే?

తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు సంచలనంగా మారుతున్నాయి.ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తూ, రాజకీయాలను హీటేక్కిస్తున్నాయి.

అయితే తెలంగాణలో రెండో ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ కాస్తా ప్రజల్లో ఢీలా పడడంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉండేందుకు ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి.అయితే ఇప్పటివరకు ఒకరకంగా ఉండే తెలంగాణ రాజకీయాలు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో ఒక్క సారిగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేగింది.

అయితే ఇప్పటికే షర్మిల పార్టీ ఏర్పాట్లపై అన్ని జిల్లాల నేతలతో వరుసగా సమావేశమవుతూ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై నేతలతో చర్చిస్తోంది.అయితే ఇప్పటికే ఖమ్మం, వరంగల్, ఇంకా ఇంకొన్ని జిల్లాల నేతలతో సమావేశమైన షర్మిల 18 న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలతో షర్మిల సమావేశమవనున్నారు.

అయితే పార్టీ ప్రకటన తరువాత షర్మిల ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నాదనే దానిపై చర్చలు మొదలయ్యాయి.అయితే షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.

Advertisement

అయితే పాలేరు నియోజకవర్గం నుండి తుమ్మల నాగేశ్వర్ రావు లాంటి నేతలు పోటీలో ఉన్నారు.అయితే ఖమ్మం జిల్లా వైయస్సార్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు.

అయితే ఖమ్మంలో మంచి పట్టు ఉండడంతో ఇక్కడి నుండే రాజకీయప్రస్థానం ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు