YS Sharmila : రాయలసీమ రాప్తాడు “సిద్ధం” సభలో జర్నలిస్టుపై దాడిని ఖండించిన వైయస్ షర్మిల..!!

ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP ) ఎన్నికల విషయంలో మంచి స్పీడ్ మీద ఉన్న సంగతి తెలిసిందే.మరో రెండు నెలలలో జరగబోయే ఎన్నికలలో ఇతర పార్టీలకంటే అన్ని విషయాలలో వైసీపీ ముందంజలో ఉంది.

 Ys Sharmila Condemns Attack On Journalist In Rayalaseema Siddham Meeting-TeluguStop.com

ఇదే సమయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్.ఎన్నికల ప్రచారం విషయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మరో పక్క “సిద్ధం” అంటూ బహిరంగ సభలో నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారానికి తెర లేపడం జరిగింది.గత ఆదివారం ఫిబ్రవరి 18వ తారీకు రాయలసీమ రాప్తాడులో “సిద్ధం” సభ( Siddham Meeting ) నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు.అయితే ఈ కార్యక్రమంలో ఓ జర్నలిస్టుపై దాడి జరిగింది.

ఆ దాడికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


అయితే ఈ దాడిని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YS Sharmila ) సోషల్ మీడియా వేదికగా ఖండించారు.“ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీ కృష్ణ పై, కర్నూల్ లో ఈనాడు పత్రిక కార్యాలయం( Eenadu office ) మీద YCP మూకల దాడి అమానుషం.ఇవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్న దాడులు.

ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నా.పత్రికా స్వేచ్ఛను వైసీపీ హరిస్తుంది అనడానికి ఈ దాడులే నిదర్శనం.

నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం, ప్రత్యక్ష దాడులకు దిగడం,కొట్టి చంపడాలు అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య.జర్నలిస్టులపై, పత్రికల కార్యాలయాలపై దాడులకు పాల్పడటం వైసీపీ పాలనలో నిత్యకృత్యం.

పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యం పై దాడి చేసినట్లే.రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ శ్రీ కృష్ణకు క్షమాపణ చెప్పాలి.

దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించి కుటుంబాన్ని ఆదుకోవాలి”.

అని ట్వీట్టర్ లో తెలియజేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube