కేసీఆర్ జాతీయ రాజకీయాలకు అనర్హుడు.. వైఎస్ షర్మిల

కేసీఆర్ జాతీయ రాజకీయాలకు అనర్హుడని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల అన్నారు.మంగళవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విరుచుకు పడ్డారు.

కేసీఆర్ దేశాన్ని ఏలతారన్నది పెద్ద జోక్ అని యెద్దేవా చేశారు.రాష్ట్రంలో కనీసం నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ కూడా లేదన్నారు.

Ys Sharmila Comments On Cm Kcr National Level Politics Details, Ys Sharmila, Com

రాష్ట్రంలో బడులు, గుడుల కంటే వైన్స్ షాపులే ఎక్కువ అని వ్యాఖ్యానించారు.రాష్ట్రాన్ని తాగుబోతుల, అప్పుల, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.

బంగారు తెలంగాణ కాదు.బతుకేలేని తెలంగాణగా చేశారన్నారు.

Advertisement

ఎంత త్వరగా ఎన్నికలు వస్తే తెలంగాణకు అంత మంచిదని చెప్పుకొచ్చారు.కేసీఆర్, కేటీఆర్‌లు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారని షర్మిల విమర్శలు గుప్పించారు.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు