సోషల్ మీడియాలో వైరల్ గా వైఎస్ జగన్ చిత్రం.. నాలుగున్నరేళ్ల పాలనకు ప్రతిబింబం

సాధారణంగా చిత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క చిత్రం చెబుతుంది.

 Ap Cm Ys Jagan Birthday Special Theme Posters Viral Social Media,ap Cm Ys Jagan,-TeluguStop.com

మనసుతో చూస్తేనే ఆ చిత్రంలోని భావాలు మన మనసుల్లో నిలిచిపోతాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) కు చెందిన ఓ అద్భుతమైన చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రేపు ( ఈనెల 21)న సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.ఈ చిత్రంలో సీఎం వైఎస్ జగన్ తన నాలుగున్నరేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ.

పేదవారిని అక్కున చేర్చుకున్న విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.చిత్రంలో ఓ వైపు పంట పొలాలు, ప్రాజెక్టులు కనిపిస్తాయి.అలాగే కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసుపోకుండా వైసీపీ సర్కార్( YCP Government ) నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్( YSR Village Health Clinic ) దర్శనమిస్తున్నాయి.సీఎం వైఎస్ జగన్ పాలనలో చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరూ సంతోషంగా ఉండగా మరోవైపు ప్రతిపక్ష నేతలు గోతికాడ నక్కల్లా తొంగి చూస్తున్నట్లుగా చిత్రం రూపొందింది.

Telugu Ap Cm Ys Jagan, Contemporary Ap, Picture, Governance, Jagan, Jagan Rule,

ప్రస్తుతం ఏపీలోని సమకాలీన పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించే విధంగా ఉన్న ఫ్లెక్సీలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరిలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలే కాదు రాష్ట్ర ప్రజలు సైతం తమ ఫోన్ స్క్రీన్స్ తో పాటు వాట్సప్ స్టేటస్ లలో.సోషల్ మీడియా( Social Media )లో హ్యాండిల్స్ సేవ్ చేసుకోవడం విశేషం.అంతేకాదు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.తమ అభిమాన నేత పాలనకు ప్రతిరూపంగా నిలుస్తున్న ఈ చిత్రాలను చూసి ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ ను షేర్ చేస్తూ విస్తృతంగా ప్రచారం చేయడంతో అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube