సోషల్ మీడియాలో వైరల్ గా వైఎస్ జగన్ చిత్రం.. నాలుగున్నరేళ్ల పాలనకు ప్రతిబింబం
TeluguStop.com
సాధారణంగా చిత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క చిత్రం చెబుతుంది.
మనసుతో చూస్తేనే ఆ చిత్రంలోని భావాలు మన మనసుల్లో నిలిచిపోతాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) కు చెందిన ఓ అద్భుతమైన చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రేపు ( ఈనెల 21)న సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
ఈ చిత్రంలో సీఎం వైఎస్ జగన్ తన నాలుగున్నరేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ.
పేదవారిని అక్కున చేర్చుకున్న విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.చిత్రంలో ఓ వైపు పంట పొలాలు, ప్రాజెక్టులు కనిపిస్తాయి.
అలాగే కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసుపోకుండా వైసీపీ సర్కార్( YCP Government ) నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్( YSR Village Health Clinic ) దర్శనమిస్తున్నాయి.
సీఎం వైఎస్ జగన్ పాలనలో చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరూ సంతోషంగా ఉండగా మరోవైపు ప్రతిపక్ష నేతలు గోతికాడ నక్కల్లా తొంగి చూస్తున్నట్లుగా చిత్రం రూపొందింది.
"""/"/
ప్రస్తుతం ఏపీలోని సమకాలీన పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించే విధంగా ఉన్న ఫ్లెక్సీలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరిలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలే కాదు రాష్ట్ర ప్రజలు సైతం తమ ఫోన్ స్క్రీన్స్ తో పాటు వాట్సప్ స్టేటస్ లలో.
సోషల్ మీడియా( Social Media )లో హ్యాండిల్స్ సేవ్ చేసుకోవడం విశేషం.అంతేకాదు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
తమ అభిమాన నేత పాలనకు ప్రతిరూపంగా నిలుస్తున్న ఈ చిత్రాలను చూసి ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ ను షేర్ చేస్తూ విస్తృతంగా ప్రచారం చేయడంతో అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోంది.
మీ అందరికీ తెలుసు కదా… పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి రష్మిక కామెంట్స్ వైరల్!