ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయడంకు ముహూర్తం ఖరారు అయ్యింది.నేడు సాయంత్రంకు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్‌కు రాజీనామా పత్రాలను సమర్పించబోతున్నాడు.
ఆ వెంటనే గవర్నర్ నరసింహన్ అత్యధిక స్థానాలు దక్కించుకున్న వైకాపా నాయకుడు జగన్‌ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానించే అవకాశం ఉంది.స్పష్టమైన ఆధిక్యం ఉన్న నేపథ్యంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
</br>
వైకాపా నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఎల్లుండి వైకాపా శాసనసభ పక్ష సమావేశం జరుగబోతుంది.ఆ రోజున తమ నాయకుడిగా వైఎస్ జగన్‌ను ఎంపిక చేస్తామని, ఆ తర్వాత ఈనెల 30న ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పుకొచ్చారు.
స్పష్టమైన మెజార్టీ రావడంతో వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.</br>
వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర కారణంగానే ఆయన అధికారంలోకి రాగలిగాడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడంటూ వైకాపా నాయకులు విమర్శించారు.రాబోయేది స్వర్ణ యుగం అని, ఏపీ ప్రజలు అద్బుతమైన అభివృద్దిని చూడబోతున్నట్లుగా వైకాపా నాయకులు చెబుతున్నారు.