వైసీపీలో చేరికలు ఆగడానికి జగన్ ఆ నిర్ణయమే కారణమా ..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో ఏ పార్టీ అయినా భారీ స్థాయిలో వలసలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాయి.నాయకులూ ఈకువమంది చేరితే వారి వెంట అనేక మంది కార్యకర్తలు చేరుతారు.

 Ys Jagan Decision Makes In Attention To The Party Members-TeluguStop.com

తద్వారా పార్టీ బలపడుతుంది అనే ధీమాతో ప్తతి పార్టీ ఉంటుంది.అయితే.

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంతో ప్తస్తుతం ఆ పార్టీలోకి వలస ఆగిపోయాయి.దీని అంతటికి కారణం ఆ పార్టీ అధినేత జగన్ కారణం.

విలువలు, విశ్వసనీయత అంటూ తరచూ చెప్పే జగన్ తన పార్టీలో అది లోపించకుండా చూసుకుంటున్నాడు.

నా మీద , మా పార్టీ మీద మీకు నమ్మకం ఉంటేనే ఓట్లు వేయండి.లేకపోతే వద్దు.కానీ నేను మిమ్మల్ని మోసం చేయడానికి అబద్ధాలను చెప్పలేను అని జగన్ కుండబద్ధలు కొడుతూ ఉన్నాడు.

అయితే జగన్ మాత్రం తనవి నైతికతతో కూడిన రాజకీయాలు అని స్పష్టం చేస్తున్నాడు.కీలకమైన ఓట్ల విషయంలోనే జగన్ అలా వ్యవహరిస్తున్నాడు.ఇక నేతల విషయంలో అయినా అంతే కండీషన్స్ తో వ్యవహరిస్తున్నాడు.

ఈ కారణంగానే ప్రస్తుతం వైసీపీలోకి చేరికలకు కొంత బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది.అధికార తెలుగుదేశం పార్టీలోని అనేకమంది నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.రాబోయే రోజుల్లో టీడీపీకి పెద్దగా ఆదరణ లేదని, ఖచ్చితంగా వాయిపే గెలవడం ఖాయం అని తేలడంతో అందరి చూపు ఇటువైపు ఉంది.

ఉత్సాహంగా పార్టీలోకి చేరేందుకు వస్తున్నవారికి జగన్ పెడుతున్న కండిషన్స్ నచ్చడంలేదట.వైసీపీలోకి ఎవరు వలస వద్దామని చూస్తున్నా వారు ఖచ్చితంగా ఆ పార్టీ ద్వారా వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే అంటూ.

కరాఖండిగా జగన్ వారికి చెప్పేస్తుండడంతో ప్రస్తుతం వారు ఆలోచనలో పడ్డారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube