చంద్రబాబు లోకేష్ లు టార్గెట్ గా జగన్ భారీ స్కెచ్.

జగన్ మోహన్ రెడ్డి కి అధికారమే పరమావధి.సీఎం కుర్చీనే జీవితాశయం అందుకే ఎంతటి దారునాలకైనా సరే పాల్పడుతున్నాడు.

 Ys Jagan Big Skech On Chandrababu And Lokesh-TeluguStop.com

ఈ సారి అధికారం రాకపోతే తన పరిస్థితి ఎంతటి దయనీయంగా ఉంటుందో వేరేగా చెప్పనవసరం లేదు.అందుకే చంద్రబాబు లోకేష్ లపై విషం కక్కడం మొదలు పెట్టాడు.

నేరుగా జగన్ చంద్రబాబు ని అవినీతి పరుడు అంటే ఎవరు నమ్మే పరిస్థితిలేదు.అంతేకాదు జగన్ కి పిచ్చి పట్టిందని అనుకుంటారు.

అందుకే జగన్ తెలివిగా పవన్ కళ్యాణ్ తో గుంటూరు సభలో చంద్రబాబు లోకేష్ లపై అవినీతి ఆరోపణలు చేయించాడు.అయితే ఇప్పుడు జగన్ మరో భారీ కుట్రని అమలు చేస్తున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితులు కూడా మాడుకు తగ్గట్లుగానే కనిపిస్తున్నాయి.ఇంతకీ ఏమిటా కుట్రా అంటే.

జగన్ చేయనున్న చంద్రబాబు పై చేస్తున్న జగన్ జగన్నాటకం లో పావుగా వాడుకుంటోంది పవన్ కళ్యాణ్ ని.అందులో భాగంగానే జగన పై వ్యాఖ్యలు చేయించాడు పవన్.బిజెపి ముందు నుంచీ చంద్రబాబు పై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నా సరే ప్రజలు నమ్మలేదు అందుకే బిజెపి , వైసీపి లు కలిసి పవన్ ని ముందుకు తోశాయి.అయితే నిన్న చంద్రబాబు ఎన్డీయే నుంచీ బయటకి వచ్చిన తరువాత వైసీపి నేత విజయసాయి రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు లోకేష్ లపై జాతీయ మీడియాలో సైతం ఆరోపణలు చేశారు.

ఇదిలాఉంటే మరో పక్క జగన్ మోహన్ రెడ్డి సైతం జాతీయ మీడియాలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.దీని వెనుక అసలు కారణం ఏంటంటే.

ఏపీలో చంద్రబాబు లోకేష్ లని దెబ్బకొట్టాలి అంటే తప్పకుండా ఇద్దరికీ ఉన్న ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలి.అందుకే ఆర్ధిక నేరాలకి తండ్రి కొడుకులు పాల్పడ్డారు అంటూ జాతీయ మీడియాలో ఊక దంపుడు స్పీచ్ లో ఇస్తున్నారు.

అంతేకాదు జాతీయ స్థాయి మీడియా ఈ విషయాలని హైలెట్ చేయడం కోసం కేంద్రం సాయం కూడా అడిగారని టాక్.అందుకే ప్రత్యేకంగా పనిగట్టుకుని మరీ జాతీయ మేడియాలోనే ఈ చర్చలు నడుపుతున్నారు…ఈ విషయంపై టిడిపిలో ఉన్న కొందరు నేతలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు…ఇలాంటి ఆరోపణలు నమ్మడానికి ఏపీ ప్రజలు సిద్దంగా లేరని ఇదంతా జగన్ పవన్ ల నాటకమని త్వరలోనే ఈ వ్యాఖ్యలు తిప్పి కొడుతామని అంటున్నారు టిడిపి నేతలు.

ఇప్పుడు ఏపీలో “పవన్ ,జగన్ ,బీజేపి” ఒక్కటయ్యారు.వీరి ప్రధాన శత్రువు ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు మరియు తనయుడు లోకేష్.వీరి ఇద్దరి ఇమేజ్ డ్యామేజ్ చేయగలిగితే విజయ సాధించినట్టేనని ఒక వ్యూహానికి వచ్చేశారు అందులో భాగంగానే ముందుగా పవన్ చెప్తేనే ప్రజలలోకి వెళ్తుంది అనే ఉద్దేశ్యంలో గుంటూరు మీటింగ్ లో చంద్రబాబు లోకేష్ లపై విమర్శలు చేయించారు.అందుకు తగ్గట్టుగానే ఢిల్లీలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు.

ఆ తరువాత జగన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూల్లో కూడా చంద్రబాబు, లోకేష్ అవినీతి చేశారని ప్రధానంగా ప్రస్తావించటం గమనార్హం.అయితే చంద్రబాబు వ్యక్తిత్వం , నిజాయితీ గురించి జాతీయ స్థాయిలో అందరికీ తెలుసు.

ముఖ్యంగా ఏపీ ప్రజలకి చంద్రబాబు మీద ఎంతో నమ్మకం.జగన్ లాంటి ఆర్ధిక నేరగాడు చంద్రబాబు గురించి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని….జగన్ పవన్ లని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అంటున్నారు టిడిపి నేతలు.

త్వరలోనే చంద్రబాబు సరైన సమాధానం చెప్తారని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube