Gangavva in intinti ramayanam : గంగవ్వ నటించిన మరో సినిమా... యూట్యూబర్ సినిమా స్టార్‌ అయ్యిందిగా!

మై విలేజ్ షో అనే యూట్యూబ్‌ ఛానల్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న గంగవ్వ ఆ తర్వాత బిగ్ బాస్‌ లో కూడా సందడి చేసిన విషయం తెల్సిందే.

బిగ్‌ బాస్ నుండి ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా ఆమె బయటకు వచ్చేసింది.

బిగ్‌ బాస్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సుపరిచితురాలు అయిన గంగవ్వ ఆ తర్వాత సినిమా ల్లో నటిస్తూ బిజీ బిజీగా మారింది.ఒక వైపు సినిమా ల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తూ కూడా మరో వైపు యూట్యూబ్‌ వీడియోలతో పాపులారిటీని మరింతగా పెంచుకుంటుంది.

చిరంజీవి సినిమా గాడ్‌ ఫాదర్ లో నటించిన గంగవ్వ తాజాగా మరో ప్రముఖ సినిమాలో నటించింది.మారుతి సమర్పిస్తున్న ఇంటింటి రామాయణం అనే సినిమా లో గంగవ్వ కీలక పాత్రలో నటించింది.

ఈమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.పోస్టర్ లోనే గంగవ్వ యొక్క ఫొటో ను పెట్టారు అంటే సినిమా లో ఆమె యొక్క ప్రాముఖ్య ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

సోషల్‌ మీడియా లో గంగవ్వకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందుకే ఆమెను తమ సినిమా ల్లో నటింపజేసేందుకు చిన్న సినిమాల మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.గంగవ్వ తాజాగా ఈ సినిమా లో కీలక పాత్రలో నటించడం వల్ల ముందు ముందు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు లేకపోలేదు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

సిరీస్ లు మరియు సినిమాలతో గంగవ్వ చాలా బిజీగా ఉంది.అందుకే ఆమె ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా తో పాటు మరింతగా యూట్యూబ్‌ లో కూడా పాపులారిటీ సొంతం చేసుకున్న గంగవ్వ ఈ సినిమా తో కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంను ఫిల్మ్‌ సర్కిల్స్‌ వారు మాట్లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు