టాలీవుడ్ లో చాలా మంది హీరోలు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు.అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ఉన్న నాగ శౌర్య పెళ్లి చేసుకొని కొత్త బంధం లోకి అడుగు పెట్టడం తో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
హీరో గా నాగ శౌర్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.వరస సినిమాలు చేస్తూ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సొంత నిర్మాణం లో కూడా చేస్తూ టాలీవుడ్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు.
ఎన్ని సినిమాలు చేసిన నాగ శౌర్య ఇప్పటి వరకు ఒక్క కాంట్రవర్సీ కి కూడా తావు ఇవ్వలేదు.తన పరిధిలో తాను సినిమాలు చేసుకుంటూనే వెళ్తున్నాడు.
ఇక నటన లో కూడా మంచి వేరియేషన్స్ కూడా చూపిస్తూ దూసుకుపోతున్నాడు.
ఈ మధ్య కృష్ణ వింద విహారి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ శౌర్య పర్వాలేదు అనిపించుకున్నాడు.
ఇక 33 ఏళ్ళ నాగ శౌర్య చాల రోజులుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు.ఇక సినిమాలతో బిజీ గా ఉన్నా కూడా కాసేపు వాటికి విరామం ఇచ్చి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి బంధం తో తన జీవితంలోకి ఆహ్వానించాడు.
ఆ అమ్మాయి పేరు అనూష శెట్టి.ఆమె స్వస్థలం బెంగుళూరు కాగా, ఆమె అక్కడ ఇంటీరియర్ డిజైనర్ గా ఫుల్ పాపులర్ గా ఉంది.నాగ శౌర్య కి అనూష శెట్టి కి పరిచయం ఎలా అయ్యింది అని చాల మంది అనుకుంటున్నారు.

అయితే వీరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం కాగా కొన్నాళ్ల పాటు బాగానే స్నేహితులుగా కొనసాగారు.ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు.ఇద్దరి ఇంట్లో పెద్దలు వీరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో బెంగుళూరు లో ఒక లక్సరీ హోటల్ లో చాల గ్రాండ్ గా వీరి పెళ్లి జరిగింది.
ఇక వీరి పెళ్లి వార్త మీడియా కు తెలిసిన రోజు నుంచి నాగ శౌర్య కట్నం ఎంత తీసుకుంటున్నాడు అంటూ కొన్ని పోస్టులు కనబడుతున్నాయి.కోట్లకు అధిపతి అయినా అనుష్క ఫ్యామిలి బ్యాగ్రౌండ్ చాల పెద్దదే.
ఇక నాగ శౌర్య కి కట్నంగా కొన్ని ప్రాపర్టీస్ తో పాటు ఒక 50 కోట్ల వరకు డబ్బు ముట్టచెప్పారట అనూష తల్లిదండ్రులు.
.