టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నారు.
ఇక విడుదల తేదీ దగ్గర అవుతుండడంతో సినిమా ప్రొమోషన్స్ లో వేగం పెంచేశారు.
ఈ సినిమా నుండి వరుస అప్డేట్ లు విడుదల చేస్తూ ఎప్పుడు ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు.ఇక ఈ మధ్యనే ఈ సినిమా నుండి విడుదల అయినా ఆర్ఆర్ఆర్ గ్లిమ్స్ బాగా ఆకట్టుకుంది.
ఇక రెండు రోజుల క్రితం విడుదల అయినా నాటు నాటు సాంగ్ అయితే యూట్యూబ్ బద్దలు అవుతుంది.

ఇక యూట్యూబ్ వేదికగా వీడియోలు రిలీజ్ అవ్వడం వాటిపై నెటిజెన్స్ కామెంట్స్ చేయడం ఎప్పుడు సాధారణ మైన విషయమే.కానీ స్వయంగా యూట్యూబ్ నే కామెంట్ చేయడం మాత్రం విశేషం అనే చెప్పుకోవాలి.తాజాగా టాలీవుడ్ స్టార్స్ అయినా ఎన్టీఆర్, చరణ్ లపై స్వయంగా యూట్యూబ్ ప్రశంసలు కురిపించడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.

యూట్యూబ్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ప్రోమోట్ చేయడం స్టార్ట్ చేసింది.ఆర్ ఆర్ ఆర్ స్టార్స్ పై యూట్యూబ్ చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా నుండి విడుదల అయినా నాటు నాటు అనే సాంగ్ లో ఈ ఇద్దరు స్టార్స్ చేసిన డాన్స్ గురించి యూట్యూబ్ కామెంట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

ఈ ఇద్దరు చేసిన డాన్స్ ప్రేక్షకులనే కాకుండా యూట్యూబ్ కూడా ఫిదా అయ్యింది.యూట్యూబ్ ఇండియా ట్విట్టర్ అకౌంట్ లో ఈ డాన్స్ పై కామెంట్ చేసింది.నిజం చెప్పాలంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ డాన్స్ ఇప్పటికీ 0.5 రెట్లు వేగంగా అనిపిస్తుంది.కొంతమంది వీళ్ళ డాన్స్ ఇంటర్నెట్ కన్నా స్పీడ్ గా ఉందని అన్నారు.నిజమే’ అంటూ కామెంట్ చేసింది.ప్రెసెంట్ ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.





 

