ఆస్ట్రేలియా దేశంలో( Australia ) ఒక ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది.ఇద్దరి మహిళలు పూటుగా మద్యం తాగి పోలీస్ ఆఫీసర్ ను ( Police Officer ) కొట్టాలని ప్రయత్నించారు కానీ పోలీస్ ఆఫీసర్ తిరిగి వారిద్దరిని చితకబాదుడు బాదాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఇద్దరు మహిళలు ఒక పార్కులో బాగా మద్యం తాగి ( Drunk ) రచ్చ చేస్తుండడం గమనించవచ్చు.
అయితే కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో ఒక అధికారి అక్కడికి చేరుకున్నారు.అతడిని చూసిన మహిళలు నువ్వు మమ్మల్ని ఏం చేస్తావన్నట్లు అతడి పై అటాక్ చేసేందుకు ప్రయత్నించారు.
అయితే పోలీస్ అధికారి వారిని హ్యాండిల్ చేయడానికి ముందుగానే సిద్ధమయ్యాడు.

ఒక యువతి( Woman ) తన వైపుగా వస్తుండగా అధికారి వెంటనే అలర్ట్ అయ్యాడు.ఆమె దాడి చేయడానికి ముందే బూటు కాళ్లతో కడుపులో గట్టిగా తన్నాడు.దాంతో ఆమె కింద పడిపోయింది.
ఆ తర్వాత మళ్లీ లేచి ఆ యువతి అటాక్ చేయడానికి ప్రయత్నించింది.దాంతో పోలీస్ ఆఫీసర్ భౌతికంగా కొట్టకుండా పెప్పర్ స్ప్రే( Pepper Spray ) వాడాడు.
అయితే ఆ పేపర్ స్ప్రే ఒక విప్పుడ్ క్రీమ్ వలే ఉంది.

స్ప్రే కొట్టిన తరువాత గానీ ఆ యువతులు తగ్గలేదు.ఈ వీడియో చూసిన చాలామంది షాక్ అవుతున్నారు.పోలీస్ ఆఫీసర్ ఫ్రంట్ కిక్కు సూపర్ గా ఇచ్చాడని కొందరు పొగిడారు.
మరికొందరు అక్కడ ఉన్నవారు పోలీస్ ఆఫీసర్ కి సపోర్ట్ చేయడం తమకు నచ్చిందని అన్నారు.







