బీజేపీ- జనసేన పొత్తుతో తెలంగాణ బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందని తెలుస్తోంది.ఎవరి టికెట్లకు ఎసరు వస్తుందోనన్న ఆందోళనలో బీజేపీ నాయకులు ఉన్నారని సమాచారం.
అయితే జనసేనతో కలిసి వెళ్తామని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లోని నాయకుల్లో గుబులు మొదలైంది.ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి, కూకట్ పల్లి స్థానాలు జనసేనకు ఇస్తారన్న వార్తలు జోరందుకున్న సంగతి తెలిసిందే.
కాగా శేరిలింగంపల్లి నియోజకవర్గ టికెట్ ను జనసేనకు ఇవ్వడాన్ని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆ టికెట్ ను రవి యాదవ్ కు వచ్చేలా ఆయన పావులు కదుపుతున్నారని సమాచారం.
అలాగే కూకట్ పల్లి స్థానాన్ని జనసేనకు ఇవ్వడాన్ని మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీశ్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారని సమాచారం.







