ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. జూనియర్ ఎన్టీఆర్ పర్ఫామెన్స్ కు అవార్డ్ అంటూ?

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో అందరూ ఊహించిన విధంగానే ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి వాయిదా పడింది.

భారీ బడ్జెట్ తో ఆకాశాన్ని తాకే స్థాయి అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీని ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఫిబ్రవరి, మార్చి నెలలు సినిమాల విడుదలకు అనుకూలం కాకపోవడంతో సమ్మర్ లో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే దుబాయ్ సెన్సార్ సభ్యులలో ఒకరైన ఉమైర్ సంధు తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీని వీక్షించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా తన రివ్యూ ఇచ్చారు.

ఆర్ఆర్ఆర్ మూవీకి రామ్ చరణ్ ఆత్మ అని ఈ సినిమాలో ఎన్టీఆర్ అభినయానికి జాతీయ అవార్డు రావడం గ్యారంటీ అని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.ఆర్ఆర్ఆర్ సినిమాకు ఒక్క కట్ కూడా చెప్పాల్సిన అవసరమైతే తనకు రాలేదని ఉమైర్ సంధు అన్నారు.

హీరో రామ్ చరణ్ కు ఈ సినిమా గేమ్ ఛేంజర్ అవుతుందని ఆయన కామెంట్లు చేశారు.

Advertisement

ఫ్యాన్స్ కు పిచ్చెక్కేలా రామ్ చరణ్ నటన ఉంటుందని చరణ్ ఆ పాత్రలో జీవించేశాడని ఉమైర్ సంధు కామెంట్లు చేశారు.ఉమైర్ సంధు తన ట్వీట్లతో ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలను మరింత ఎక్కువగా పెంచారు.త్వరలో ఆర్ఆర్ఆర్ మూవీ కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాపై అల్లూరి సౌమ్య హైకోర్టులో అపీల్ దాఖలు చేశారు.మహనీయుల చరిత్రను సినిమాలో వక్రీకరించారని ఆరోపిస్తూ సౌమ్య అపీల్ ను దాఖలు చేయడం గమనార్హం.అపీల్ కు సంబంధించి రాజమౌళికి, విజయేంద్ర ప్రసాద్ కు, మరి కొందరికి నోటీసులు అందాయని సమాచారం.

రాజమౌళి ఈ అపీల్ గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement
" autoplay>

తాజా వార్తలు